Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
 
 
 
 
 
 
హోమ్‌ >> ఇంగ్లీష్ – పూచీ నిరాకరణ
MLRBI English Content

గణాంకాలలో తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏదయినా సందేహం కలిగినట్లయితే, ముద్రణ ప్రతిని సంప్రదించవలెను.

ఈ సైట్లో తాజా మరియు ఖచ్చితమైన సమాచారం అందించుటకు ఆర్ బి ఐ పూర్తి ప్రయత్నం చేసినప్పటికీ, ఏవైనా అంశాల ఖచ్చితత్వానికి లేదా సంపూర్ణతకు రిజర్వ్ బ్యాంక్ బాధ్యత వహించదని సందర్శకులు గమనించాలి. సందర్శకులు వారి సొంత శ్రద్ధ, విచక్షణ ఉపయోగించవలెనని సూచన.

ఇతర వెబ్‌సైట్లకు లింకులు మీకు అవసరమయిన మరియు సంబంధిత సమాచారం పొందుటలో సహాయంకొరకు ఈయబడ్డాయి. కానీ, ఆసైట్లలోని సమాచారానికి సంబంధించి ఆర్ బి ఐ బాధ్యత వహించదు.

ఈ వెబ్‌సైట్ యొక్క ఏ భాగంలోనైనా ఒక వ్యక్తి లేదా సంస్థను పేర్కొనుట, ఆ వ్యక్తి లేదా సంస్థ అందించిన ఉత్పత్తులు లేదా సేవలను రిజర్వ్ బ్యాంక్ ఏవిధంగానూ ఆమోదించినట్లు భావించరాదు.

పూచీలు మరియు బాధ్యతల నిరాకరణ

ఈ వెబ్‌సైట్‌లోని విషయాలు ఎటువంటి పూచీ లేకుండా, 'యథాతథంగా' (‘as is’ basis) అందించబడినవి. ఈ క్రింది విషయాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ జవాబుదారుకాదు లేదా ఎట్టి బాధ్యత వహించదు -

a) ఖచ్చితత్వం, సవ్యత, విశ్వసనీయత, వర్తమానత, కాలీనత, ఉల్లంఘన, టైటిల్, విక్రయ అర్హత లేదా ఏదైనా ప్రత్యేక ప్రయోజనం కొరకు ఈ వెబ్ సైట్లోని విషయాల యొక్క యోగ్యత;

b) ఈ వెబ్ సైట్ ద్వారా లభించే విషయాలు లేదా వాటితో సంబంధం కలిగి ఉన్న క్రియలు నిరంతరాయంగా లేదా లోపరహితంగా ఉంటాయి/ లేక ఆ లోపాలు సరిచేయబడతాయి లేదా ఈ వెబ్ సైటు మరియు సర్వర్లో ఎటువంటి వైరస్‌లు, ఇతర హానికరమైన అంశాలు లేవు/ మరియు ఉండబోవు.

ఈ వెబ్‌సైట్ వినియోగం వల్ల ఎటువంటి హాని, నష్టం (ప్రత్యక్షంగాగాని లేదా పరోక్షంగాగాని) ఏవిధంగా సంభవించినా, రిజర్వ్ బ్యాంక్ జవాబుదారు కాదు. ఇంతేగాక, ఈ వెబ్‌సైట్‌లో కలిగిఉన్న/లభించే విషయాలమీద ఆధారపడినందువల్ల కలిగే ఎటువంటి హానికీ, నష్టానికీ కూడా ఆర్ బి ఐ బాధ్యత వహించదు.

ఈ వెబ్‌సైట్‌లోని అంశాలు ఆర్ధికపరమైన లేదా ఇతర వృత్తిపరమైన సలహాలు కావు. ఆర్థిక లేదా ఇతర వృత్తిపరమైన సలహా అవసరమైతే, సమర్థులైన వృత్తి నిపుణుల సేవలు కోరవలెను.

ఏక్సెస్ హక్కు

ఈ వెబ్ సైటును ఎప్పటికప్పుడు నవీకరించడానికి లేదా సవరించడానికి ఆర్ బి ఐ హక్కును కలిగి ఉంది. ఇంతేగాక, ఎవరైనా నిర్దుష్ట వ్యక్తులకు, లేదేని ఒక నిర్దిష్ట ఇంటర్నెట్ అడ్రస్ నుండి ఈ వెబ్‌సైటుకు యాక్సెస్, ఏసమయంలోనైనా ఏకారణాలనూ చూపకుండా,నిరోధించుటకు రిజర్వ్ బ్యాంక్ అన్ని హక్కులూ కలిగిఉన్నది.

ఈ వెబ్‌సైట్ నుండి ఇతర వెబ్‌సైట్లకు లింకులు

ఈ వెబ్‌సైట్ రిజర్వ్ బ్యాంక్‌చే నిర్వహించబడని వెబ్‌సైట్లకు హైపర్ లింకులను కలిగి ఉంది. ఆవెబ్‌సైట్లలోని విషయాలకు లేదా వాటిని సందర్శించినందువల్ల కలిగిన ఎటువంటి హానికి, నష్టానికీ ఆర్ బి ఐ బాధ్యత వహించదు. హైపర్-లింకుల ఉపయోగం మరియు అలాంటి లింక్ వెబ్ సైట్లను సందర్శించడం, పూర్తిగా మీ స్వంత బాధ్యత.

ఇతర వెబ్ సైట్లకు అన్ని హైపర్ లింకులు, ఈ వెబ్‌సైట్ వినియోగదారుల సౌలభ్యం కొరకు అందించబడుతున్నవి. ఆ వెబ్‌సైట్లలో వినియోగించిన/కనిపిస్తున్న వర్తక లేదా సేవా గురుతులు, లోగోలు, చిహ్నాలు లేదా ఇతర సాధనాలకు ఆర్ బి ఐకి సంబంధము/అనుబంధము కలదని ఎట్టి పరిస్థితిలోనూ భావించరాదు.

ఇతర వెబ్‌సైట్లనుండి ఈ వెబ్‌సైటుకు లింకులు

ఈ క్రింది సందర్భాలలో తప్ప, ఈ వెబ్‌సైటును 'కాషింగ్' (caching) మరియు లింకుచేయుట, ఈ వెబ్‌సైటును గాని దానిలోని భాగంగాని 'ఫ్రేమింగ్' (framing) చేయుట, నిషేధించబడినది.

హోం పేజికి లింకింగ్ – ఆర్బిఐకి వ్రాతపూర్వకంగా తెలిపి, మీరు ఈ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజి http://www.rbi.org.in కి లింక్ చేయవచ్చు,

ఈ వెబ్ సైట్ యొక్క అంతర్గత పుటకు(హోమ్ పేజి కాకుండా) హైపర్-లింకింగ్ చేయుటకు / లేదా దానిలోని ఏదైనా విషయాలను 'ఫ్రేమింగ్' చేయుటకు, లేదా ఆ తరహా కార్యకలాపాలలో పాల్గొనుటకు ముందుగా, వినియోగదారుడు ఒక నిర్దిష్టమైన అభ్యర్థన చేసి, రిజర్వ్ బ్యాంక్ అనుమతిని పొందవలెను. హైపర్ లింకింగ్, వెబ్‌సైట్/దానిలోని భాగం 'ఫ్రేమింగ్' చేయుటకు అనుమతి జారీచేసే సమయంలో, షరతులు విధించే హక్కు రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉంటుంది.

ఈ వెబ్ సైటుకు లింక్ చేయుట, వెబ్‌సైట్/దానిలోని విషయాలను 'ఫ్రేమింగ్' చేయుట, విధించిన షరతులను/నిబంధనలను అంగీకరించినట్లుగా భావించబడుతుంది. ఈ నియమ నిబంధనలకు చేసిన మార్పులు, సవరింపులు కూడా అంగీకరించినట్లుగా భావించబడుతుంది. ఈ నిబంధనలు మరియు షరతులు ఆమోదయోగ్యం కాకపోతే, వినియోగదారుడు ఈ వెబ్‌సైట్ లింక్ చేయుట, వెబ్‌సైట్/దానిలోని భాగాలు 'ఫ్రేమ్‌' చేయుట నిలిపివేయాలి.

అనుచితమైన, దూషణపూరిత, అప్రతిష్ఠకరమైన, ఉల్లంఘనకరమైన, అశ్లీలమైన, అసభ్యకరమైన లేదా చట్టవిరుద్ధమైన అంశాలు, పేర్లు, విషయం లేదా సమాచారం లేదా ఏ వ్రాతపూర్వక చట్టాన్ని ఉల్లంఘించే విషయం లేదా సమాచారం, ఏదైనా మేధో/ యాజమాన్య/ గోప్యత లేదా ప్రచార హక్కులు కలిగి ఉన్న సైట్‌లయొక్క లింకులు, 'ఫ్రేములను' నిలుపు చేయుటకు రిజర్వ్ బ్యాంక్ అన్ని హక్కులు కలిగి ఉన్నది.

ఏదైనా అనధికారిక లింకులు లేదా ఫ్రేములను నిలిపివేసే హక్కును ఆర్ బి ఐ కలిగి ఉంది. ఇంతేగాక, ఈ వెబ్‌సైట్ నుండి / ఈ వెబ్‌సైటుకు చేరగలిగే, ఇతర సైట్లలో లభించే విషయాలకు రిజర్వ్ బ్యాంక్ బాధ్యత అంగీకరించదు.

 
టాప్ 
 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….