RBI/2015-2016/168
DPSS(CO) RTGS No.492/04.04.002/2015-2016
సెప్టెంబర్ 1, 2015
RTGS లో భాగస్వామి సంస్థల
చైర్‌మేన్, మ్యానేజింగ్ డైరెక్టర్,
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అమ్మా/అయ్యా,
RTGS కాల అవధుల్లో మార్పు
"సెప్టెంబర్ 1 నుండి, రెండవ, నాలుగవ శనివారాల్లో బ్యాంకులకు శెలవు; పనిచేసే శనివారాలలో రిజర్వ్ బ్యాంక్ సహకార సేవలు" అన్న అంశంపై ఆగస్ట్ 28, 2015 న విడుదలచేసిన పత్రికా ప్రకటన సం. 2015-2016/528 దయచేసి చూడండి.
2. అందులో చెప్పబడినట్లు, రెండవ, నాలుగవ శనివారాల్లో RTGS నిర్వహింపబడదు. అయితే, పనిచేసే శనివారాల్లో, రోజంతా నిర్వహింప బడుతుంది. భవిష్యత్తులో నిర్ధారిత తేదీన విలువ ఆధారంగా చేయవలసిన లావాదేవీలు, (future value dated) ఒకవేళ ఆ తేదీ, రెండవ లేక నాలుగవ శనివారం అయినట్లయితే, RTGS, క్రింద చర్యకై చేపట్టబడవు
3. సెప్టెంబర్ 1, 2015 నుండి RTGS పని వేళలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
క్రమ సంఖ్య |
కాల/కార్య వివరణ |
శనివారాలతో సహా నెలలో అన్ని రోజులు (రెండవ మరియు నాలుగవ శనివారాలు మినహా) |
1. |
కార్య కలాపాల ఆరంభం |
08. 00 గం. |
2. |
మొదటి ముగింపు (వినియోగదారుల లావాదేవీలు) |
16. 30 గం. |
3. |
తుది ముగింపు (ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు) |
19. 45 గం. |
4. |
ఐ డి ఎల్ రివర్సల్ |
19. 45 గం. –
20. 00 గం. |
5. |
కార్యకలాపాల ముగింపు |
20. 00 గం. |
4. ఈ సర్క్యులర్, పేమెంట్ & సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్ 2007, సెక్షన్ 10 (2) క్రింద జారీ చేయబడింది.
5. దయచేసి ఇది అందినట్లు తెలియజేయవలెను
నీలిమా రాంటెకె
జనరల్ మేనేజర్ |