RBI/2015-16/221
DBR.IBD.BC.52/23.67.003/2015-16
నవంబర్ 3, 2015
అన్ని షెడ్యూ్ల్డ్ వాణిజ్య బ్యాంకులు (గ్రామీణ బ్యాంకులు మినహా)
అయ్యా/అమ్మా,
పసిడి నగదీకరణ పథకం, 2015 – సవరణ
సెక్షన్ 35 A బ్యాకింగ్ నియంత్రణ చట్టం, 1949 ద్వారా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు దఖలుపరచబడిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (పసిడి నగదీకరణ పథకం, 2015) మాస్టర్ డైరెక్షన్ No.DBR.IBD.No.45/23.67.003/2015-16 తేదీ అక్టోబర్ 22, 2015, ఈ క్రింది విధంగా సవరించబడవలెనని ఆదేశించడమైనది:
ప్రస్తుతం ఉన్న సబ్ పేరాగ్రాఫ్ 2. 1. 2 (i), ఈ క్రింది విధంగా సవరించబడుతుంది:
'ఏదేని ఒక పర్యాయంలో, చేయగల ముడి బంగారం [కడ్డీలు, నాణేలు, ఆభరణాలు (పొదగబడ్డ రాళ్ళు, ఇతర లోహాలు మినహా)] డిపాజిట్, కనీసం 30 గ్రాములు. పథకం క్రింద, డిపాజిట్ పై గరిష్ఠ పరిమితి లేదు.'
రాజిందర్ కుమార్
చీఫ్ జనరల్ మేనేజర్ |