RBI/2015-16/383
DBS.CO.PPD.BC.No.10/11.01.005/2015-16
ఏప్రిల్ 28, 2016
చైర్‌మన్/ చీఫ్ ఎక్జెక్యూటివ్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)
అమ్మా/అయ్యా,
జీలాని కమిటీ సిఫారసుల అమలు
బ్యాంకుల్లో మోసాలు/దురాచారాల విషయంలో జీలానీ కమిటీ సిఫారసులపై, మేము జారీ చేసిన సర్క్యులర్, DBS.CO.PPD.BC.No.39/11.01.005/99-2000, జూన్ 28, 2000 దయచేసి చూడండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, ఆడిట్ కమిటీ (ACB) –క్యాలెండర్ ఆఫ్ రివ్యూస్ (Audit Committee of the Board of Directors (ACB) – Calendar of Reviews) జీలాని కమిటీ సిఫారసుల అమలుపై పరిస్థితి ACB కి నివేదించాలని, మేము జారీ చేసిన సర్క్యులర్ DBS.ARS.BC.No.4/08.91.020/2010-11, నవంబర్ 10, 2010 కూడా దయచేసి చూడండి.
2. వివిధ బ్యాంకుల్లో, పై సిఫారసుల అమలు స్థితి సమీక్షించి, ఇకపై జీలానీ కమిటీ సిఫారసుల అమలుపై నివేదిక ACBకి సమర్పించనవసరం లేదని, నిశ్చయించడం జరిగింది. అయితే, బ్యాంకులు ఈ క్రింది విషయాలు రూఢి చేసుకోవాలి:
i) సిఫారసుల అమలు పరిపూర్ణంగా కొనసాగవలెను
ii) ఈ సిఫారసులను, ఇన్‌స్పెక్షన్/ఆడిట్ విధానాల్లో ఒక అంశంగా చేసి, వారి మాన్యువల్ /ఆదేశాల్లో వీటిని చేర్చవలెను.
విధేయులు,
(పార్వతి వి సుందరం) చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |