RBI/2015-16/391
FIDD.No.FSD.BC.24/05.05.014/2015-16
మే 5, 2016
చైర్‌మన్/మానేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
[అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)]
అమ్మా/అయ్యా,
ప్రత్యేక వ్యవసాయ రుణ పథకం నివేదికల (Special Agricultural Credit Plan, SACP), నిలుపుదల.
వ్యవసాయ రంగానికి రుణ సౌకర్యాలు వృద్ధి చెయ్యడానికి/ పర్యవేక్షించడానికి, ప్రత్యేక వ్యవసాయ రుణ పథకం (SACP) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1994 లోనూ, ప్రైవేట్ బ్యాంకుల్లో 2004 లోనూ ప్రవేశపెట్టబడింది. SACP క్రింద, బ్యాంకులు వారంతట వారే, ముందు సంవత్సరం కంటే 25% పెంచి, రుణ మంజూరు లక్ష్యం నిర్దేశించుకొని, దానిని ఆసంవత్సరంలో (ఏప్రిల్-మార్చ్) సాధించాలి. బ్యాంకులు, ఈ పథకం అమలులో సాధించిన ప్రగతి తెలియచేస్తూ, అర్ధ సంవత్సర నివేదికలు (ప్రతి సంవత్సరం మార్చ్/ సెప్టెంబర్ చివరిలో) రిజర్వ్ బ్యాంక్, FIDD కి పంపించాలి.
2. ఈ వివరాలు ఎలాగూ ప్రాధాన్య రంగ రుణ నివేదికల ద్వారా అందుతున్నాయి గనుక, పైన చెప్పిన నివేదికలు ఏప్రిల్, 2016 నుండి, నిలుపు చెయ్యాలని నిశ్చయించడం జరిగింది. అందువల్ల, ఈ నివేదికలు, 2016-17 సంవత్సరం నుండి, రిజర్వ్ బ్యాంక్, FIDD కి సమర్పించనవసరం లేదని బ్యాంకులకు సూచన. అయితే, రుణ జారీ నివేదికలు మార్చ్, 2016 అర్ధ సంవత్సరానికి, బ్యాంకుకు పంపించవలెను.
3. ఇది అందినట్లుగా తెలుపవలెను.
విధేయులు,
(జోస్ జె కత్తూర్)
చీఫ్ జనరల్ మేనేజర్ |