RBI/2015-16/416
FIDD.FSD.BC.No.25/05.10.001/2015-16
జూన్ 2, 2016
చైర్‌మన్/మానేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
[అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)]
అమ్మా/అయ్యా,
భారత యూనియన్ మరియు ఇతరులపై స్వరాజ్ అభియాన్ వేసిన దావాలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు - ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రదేశాల్లో బ్యాంకుల సహాయక చర్యలపై మార్గదర్శకాలు
పై దావా విచారణ సమయంలో, గౌరవనీయమైన సుప్రీమ్ కోర్ట్, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు; రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల అధికారులను, వారి విధానాలు, మనదేశ ప్రజల హితవు కోసమే ఉద్దేశించబడ్డాయి, వేరితరులకోసం కాదు గనుక, వాటిని తుచ తప్పకుండా పాటించవలసినదని నిర్దేశించింది.
అందువల్ల, అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులకు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలపై జులై 1, 2015 తేదీన మేము జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌లోని మార్గదర్శకాలను పాటించవలసినదిగా తెలియజేయడమైనది.
ఇది అందినట్లు తెలియజేయవలెను.
విధేయులు,
(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్ |