RBI/2015-16/420
FIDD.GSSD.CO.BC.NO.26/09.01.03/2015-16
జూన్ 09, 2016
చైర్‌మన్ / మేనేజింగ్ డైరెక్టర్
అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు,
అయ్యా/అమ్మా,
జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం (National Rural Livelihoods Mission,
NRLM) – ఆజీవిక – వడ్డీ సహాయక పథకం (Interest Subvention Scheme)
NRLM పథకం క్రింద, వడ్డీ సహయంపై మార్గదర్శకాలు సూచిస్తూ జారీ చేసిన మా సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.No 19/09.01.03/2015-16 తేదీ జనవరి 21, 2016 దయచేసి చూడండి. ఈ పథకాన్ని పాక్షికంగా సవరిస్తూ, భారత ప్రభుత్వం, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వారి వర్తమానం, మే 23, 2016 ద్వారా - పేరాలో I.xii (Annexure – III to v) గల ఇంటరెస్ట్ సబ్వెన్షన్ సర్టిఫికేట్‌లో (Interest Subvention Certificate), "మానవ ప్రమేయం లేకుండా" అన్న నిబంధనను, "అతి తక్కువ మానవ ప్రమేయంతో" అని మార్చవలెనని సూచించింది.
విధేయులు
(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్ |