RBI/2015-16/424
DBR.CID.BC.No.104/20.16.56/2015-16
జూన్ 16, 2016
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (RRBలతో సహా)
అన్ని వాణిజ్యేతర ఆర్థిక కంపెనీలు (CNBFCలతో సహా)
అన్ని ప్రాథమిక (అర్బన్) కోఆపరేటివ్ బ్యాంకులు
రాష్ట్ర/కేంద్ర కోఆపరేటివ్ బ్యాంకులు
అన్ని రుణ సమాచార కంపెనీలు
డియర్ సర్/మేడమ్
స్వయం సహాయక సంస్థల సభ్యులకు సంబంధించిన రుణ సమాచార నివేదన
దయచేసి జనవరి 14, 2016న జారీ చేయబడిన మా సర్క్యులర్ DBR.CID.BC.No.104/20.16.56/2015-16లోని 6వ పేరాలో ఉన్న సూచనల ప్రకారం బ్యాంకులు స్వయం సహాయక సంస్థల సభ్యుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు మరియు ఆ సమాచారాన్ని రుణ సమాచార కంపెనీలకు అందజేసేందుకు తమ సాఫ్ట్ వేర్ లో అవసరమైన వ్యవస్థలను, విధానాలను ఏర్పాటు చేసుకోవాలన్న సూచనలను గమనించండి.1
2. జూన్ 27, 2014న జారీ చేయబడిన DBOD No.CID.BC.127/20.16.056/2014-15 సర్క్యులర్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యస్థాయి సమాచారాన్ని మైక్రోఫైనాన్స్ డాటా షేరింగ్ ఫైల్ ఫార్మాట్లోకి మార్చాలని నిర్ణయించడం జరిగింది. జనవరి 14, 2016 నాటి DBR.CID.BC.No.73/20.16.056/2015-16 సర్య్కులర్ లోని పట్టిక 3కు చెందిన స్వయం సహాయక సంఘాల వ్యక్తిగత సభ్యస్థాయి సమాచారాన్ని మైక్రోఫైనాన్స్ డాటా షేరింగ్ ఫైల్ ఫార్మాట్లోకి ఎలా మ్యాపింగ్ చేయాలో అనుబంధం – I లో జతపరచడం జరిగింది.
3. నాలుగు సీఐసీలకు జులై 1, 2016 నుంచి సమర్పించదలచిన మార్పు చేసిన మైక్రో ఫైనాన్స్ డాటా షేరింగ్ ఫైల్ ఫార్మాట్‌ను అనుబంధం - II లో ఇవ్వడం జరిగింది.
మీ విశ్వసనీయులు ,
(రాజిందర్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్
Encl: పైన పేర్కొన్నవి
|