RBI/2015-16/443
DCM(Pig) No.G-12/4297/10.27.00/2015-16
జూన్ 30, 2016
చైర్‌మన్/మానేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు / ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు /
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు / రాష్ట్ర సహకార బ్యాంకులు/ కేంద్ర జిల్లా సహకార బ్యాంకులు
అయ్యా/ అమ్మా,
2005 సిరీస్ కు మునుపటి బ్యాంక్ నోట్లు –
మార్పిడి సదుపాయాల్లో సవరణ
పై విషయం పై మా సర్క్యులర్లు DCM (Pig) No.G-8/2331/10.27.00/2015-16 తేదీ డిసెంబర్ 23, 2015; DCM (Pig) No. G-9/2856/10.27.00/2015-16 తేదీ ఫిబ్రవరి 11, 2016 మరియు పత్రికా ప్రకటన తేదీ డిసెంబర్ 23, 2015 దయచేసి చూడండి.
2. జనవరి 2014 నుండి, 2005 మునుపటి బ్యాంక్ నోట్లు ఉపసంహరింపబడుతున్నాయనీ, నిర్విరామ కృషితో ఇప్పటికే చాలామటుకు నోట్లు ఉపసంహరింపబడ్డాయనీ మీకు విదితమే. ఇంకా కొంత శాతం నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ విషయం సమీక్షించిన అనంతరం, జులై 01, 2016 నుండి, ఈ నోట్లు మార్పు చేసుకొనే అవకాశం, ఈ క్రింద తెలిపిన రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటు ఉంచాలని నిశ్చయించడమైనది: అహమదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భుబనేశ్వర్, చండిగఢ్, చెన్నై, గువహాతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్‌పూర్, కోల్కటా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ దిల్లీ, పట్నా, తిరువనంతపురం మరియు కోచి. ఈ ఆదేశాలు, జూన్ 30, 2016 పత్రికా ప్రకటనలో వివరించబడ్డాయి. (ప్రతి జత పరచబడినది)
3. 2005 మునుపటి బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి
4. ఈ నోట్ల మార్పిడికై, మీ వద్దకు వచ్చే ప్రజలకు, మీరు తగిన రీతిలో సలహా ఇవ్వగలరు.
5. దయచేసి, ఈ నోట్లు కౌంటర్లనుండిగానీ, ATM ల ద్వారాగాని, తిరిగి చెలామణిలోకి రాకుండా శ్రద్ధ వహించవలెను.
6. ఇది అందినట్లు తెలియచేయవలెను
విధేయులు
(పి. విజయకుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్
జతపరచినది : ఒకటి |