Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (74.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/08/2016
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన – MoA&FW పోర్టల్‌లో పంట బీమా వివరాలు నమోదు చెయ్యడంలో బ్యాంకుల వైఫల్యం.

RBI/2016-17/41
FIDD.CO.FSD.BC.11/05.10.007/2016-17

ఆగస్ట్ 25, 2016

చైర్‌మన్‌/ మేనేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫిసర్
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)

అయ్యా/అమ్మా,

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన – MoA&FW పోర్టల్‌లో పంట బీమా వివరాలు నమోదు చెయ్యడంలో బ్యాంకుల వైఫల్యం.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) నిబంధనలని ఖచ్చితంగా అమలు పరచాలని, పథకం యొక్క ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేలా, నిర్వచించిన వ్యవసాయ రుణాలు తీసుకొన్న/తీసుకోని ఇతర వ్యవసాయదారుల వివరాలు 100% సేకరించాలని సూచిస్తూ, మేము జారీ చేసిన సర్క్యులర్ FIDD No.FSD.BC20/05.10.007/2015-16 తేదీ మార్చ్ 17, 2016, దయచేసి చూడండి.

2. భారత ప్రభుత్వం యొక్క PMFBY, నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా, బ్యాంకులు పంట బీమా వినియోగించుకొంటున్న అందరు వ్యవసాయదారుల (రుణం తీసుకొన్న/ తీసుకోని) భూమి/పంట వివరాలు, వారి శాఖలనుండి సేకరించవలసి ఉంది.

3. వ్యవసాయ, వ్యవసాయదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Agriculture & farmers Welfare), పంట బీమాకై ఏకీకృతంచేసిన పోర్టల్ – www.agriinsurance.gov.in. లో వ్యవసాయదారుల వివరాలు నమోదు చేయవలసిందిగా అన్ని బ్యాంకులకు సూచించింది. అయితే, బ్యాంకు శాఖలు ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయడం లేదని మాదృష్టికి వచ్చింది. ఈ కారణంగా MoW&FW, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైనవారు, బీమా చేయబడిన పంటలు, వసూలు చేసిన ప్రీమియమ్‌ మొ.వి అంచనా వేయడంలో, కష్ట పడవలసి వస్తోంది. అందువల్ల, మీ శాఖలకు పై వివరాలు, ఈ పోర్టల్‌లో నమోదు చేయవలసినదిగా సత్వరం ఆదేశాలు జారీచేయవలెను.

విధేయులు,

(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మానేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….