RBI/2016-17/57
DCBR.BPD (PCB).BC.No.3/12.05.001/2016-17
సెప్టెంబర్ 1, 2016
చీఫ్ ఎక్జెక్యూటివ్ అధికారులు,
వేతనదారుల ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు
అయ్యా/అమ్మా,
సభ్యులు కాని వారికి నిర్ణీతకాల డిపాజిట్లపై రుణాలు
ఆగస్ట్ 8, 2001 తేదీన జారీచేసిన మా సర్క్యులర్ UBD.No.BL.(SEB)5A/07.01.00-2001/02 ప్రకారం, శాఖలు తెరవడానికి అనుమతికోసం దరఖాస్తుచేసే వేతనదారుల ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు (SEBs) వారి బై లాస్‌లో, బయటివారిని (వేతనదారులు కానివారిని) సభ్యులుగా/నామమాత్రపు సభ్యులుగా చేర్చుకొని, రుణాలు జారీ చేయడానికి వీలు కల్పించే నిబంధనలు లేవని నిర్ధారించుకోవాలి.
2. డిసెంబర్ 14, 2015 న జరిగిన 32 వ స్థాయీ సలహా సంఘం
సమావేశంలో జరిపిన చర్చల అనంతరం, SEBలు సభ్యులు కానివారికి కూడా, ఈ క్రింది షరతులకు లోబడి రుణాలు జారీ చేయవచ్చని, నిర్ణయించబడింది:
-
మా సర్క్యులర్లు UBD.CO.LS (PCB) Cir.No.20/07.01000/2014-15 తేదీ ఆక్టోబర్ 13, 2014 మరియు DCBR.CO.LS (PCB) Cir.No.4/07.01.000/2014-15 తేదీ జనవరి 28, 2015 లో సూచించిన విధంగా SEB, ఆర్థికంగా పటిష్టంగా నిర్వహించబడుతున్నదై ఉండాలి.
-
మా సర్క్యులర్ UBD.No.Plan.(PCB).9/09.06.00-94/95 తేదీ జులై 25, 1994 లో సూచించిన విధంగా ఏర్పాటు చేయబడి, పనిచేస్తున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, ఆడిట్ కమిటీ కలిగి ఉండవలెను.
-
బై లాస్, సభ్యులు కానివారికి నిర్ణీతకాల డిపాజిట్లపై రుణాలు మంజూరు చెయ్యడానికి అనుమతిస్తూ నిబంధనలు కలిగి ఉండవలెను.
-
వారి బోర్డ్ విధానం ప్రకారం ఇటువంటి రుణాలపై ఎల్లప్పుడూ తగినంత మార్జిన్ నిర్వహించవలెను.
-
నిర్ణీతకాల డిపాజిట్లపై రుణంతప్ప, సభ్యులు కానివారికి మరి ఎటువంటి పరపతి సౌకర్యాలు మంజూరు చేయరాదు.
3. మా సర్క్యులర్ UBD.No.BL (SEB) 5A/07.01.00-2001/02 తేదీ ఆగస్ట్ 8, 2001 లో పేర్కొన్నఇతర నిబంధనలు అన్నీ యథాతథంగా ఉంటాయి.
విధేయులు,
(ఏ జి రే)
జనరల్ మానేజర్-ఇన్-చార్జ్
|