RBI/2016-17/82
DGBA.GAD.881/15.02.005/2016-17
అక్టోబర్ 13, 2016
ద ఛైర్మన్ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ను నిర్వహిస్తున్ ఏజెన్సీ బ్యాంకులు, కిసాన్ వికాస్ పత్ర- 2014,
సుకన్యా సమృద్ధి అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ - 2014
డియర్ మేడమ్/సర్,
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల సవరణ
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము జులై 07, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం.DGBA.GAD.13/15.02.005/2016-17ను గమనించండి. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 29, 2016న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం నెం. (OM) No.F.No.1/04/2016–NS.II మరియు అక్టోబర్ 03, 2016న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 5(4)-B(PD)/2016 ను అనుసరించి 2016-17 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసానికి వివిధ చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను సవరించాలని సూచించింది. (కాపీలను జతపరచడం జరిగింది)
2. ఈ సర్క్యులర్ లోని ముఖ్యాంశాలను తగిన చర్యల కొరకు ప్రభుత్వ చిన్న పొదుపు ఖాతాలను నిర్వహిస్తున్న మీ శాఖల యొక్క దృష్టికి తీసుకురావాలని బ్యాంకులను కోరడమైనది. ఈ పథకాలలో సభ్యుల సమాచార నిమిత్తం వాటిని మీ శాఖల యొక్క నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శించాలి.
మీ విశ్వసనీయులు,
(వీ ఎస్ ప్రజిష్)
సహాయ జనరల్ మేనేజర్
Encl : పైన పేర్కొన్నవి |