RBI/2016-17/84
FIDD.FSD.BC.No.18/05.05.10/2016-17
అక్టోబర్ 13, 2016
ద ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్/ సీఈఓలు,
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(RRBలు కాకుండా ఇతర బ్యాంకులు)
డియర్ మేడమ్/సర్,
పునరుద్ధరించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము ఆగస్టు 07, 2012న జారీ చేసిన సర్క్యులర్ నెం.RPCD.FSD.BC.No.23/05.05.09/2012-13 ను చూడండి.
2. అనుంబంధంలో సూచించినట్లుగా పునరుద్ధరించిన KCCలోని పేరా 13లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించడమైనది. అన్ని బ్యాంకులూ ఆ మార్చిన సూచనలను గుర్తించి వెంటనే వాటిని అమలు చేయాలని ఆదేశించడమైనది.
మీ విశ్వసనీయులు,
(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్
Encl: పైన పేర్కొన్నవి
వివరాలు
ANNEX
వివరాలు |
ఆగస్టు 7, 2012న జారీ చేసిన సర్క్యులర్ నెం.RPCD.FSD.BC.No.23/05.05.09/2012-13 కు అనుగుణంగా జారీ చేసిన సూచనలు |
సవరించిన సూచనలు |
పేరా 13 ఇతర అంశాలు |
13.ii తప్పనిసరిగా చేయాల్సిన పంట బీమాతో పాటు, కేసీసీ కలిగి ఉన్నవారు ఆస్తి బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం (PAIS) మరియు ఆరోగ్య బీమా (ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడ) యొక్క లాభాలను కూడా స్వీకరించేందుకు అవకాశం ఉండాలి. వాటి ప్రీమియంను అతని కేసీసీ అకౌంట్ ద్వారా చెల్లించాలి. బ్యాంకు మరియు రైతు మధ్య కుదిరిన చెల్లింపు నిష్పత్తి ఒప్పందానికి అనుగుణంగా బీమా కంపెనీలకు కేసీసీ అకౌంట్ నుంచి ప్రీమియంను చెల్లించాలి. లభించే బీమా కవరేజ్ గురించి రైతు లబ్ధిదారులకు అవగాహన కల్పించి, దరఖాస్తు దశలోనే వారి అంగీకారం (పంట బీమా విషయంలో తప్ప, అది తప్పనిసరి కనుక) పొందాలి. |
13.ii తప్పనిసరిగా చేయాల్సిన పంట బీమాతో పాటు, కేసీసీ కలిగి ఉన్నవారు ఏదో ఒక రకం ఆస్తి బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం (PAIS) మరియు ఆరోగ్య బీమా (ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడ) యొక్క లాభాలను కూడా స్వీకరించేందుకు అవకాశం ఉండాలి. ప్రీమియంను అతని కేసీసీ అకౌంట్ నుంచి చెల్లించాలి. ఈ పథకంలోని నిబంధలను అనుసరించి రైతులు/బ్యాంకులు ప్రీమియంను చెల్లిస్తాయి. లభించే బీమా కవరేజ్ గురించి రైతు లబ్ధిదారులకు అవగాహన కల్పించి, దరఖాస్తు దశలోనే వారి అంగీకారం (పంట బీమా విషయంలో తప్ప, అది తప్పనిసరి కనుక) పొందాలి. |
|