RBI/2016-17/111
DPSS.CO.PD.No./02.10.002/2016-2017
నవంబర్ 08, 2016
ద ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
RRBలతో సహా అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర
సహకార బ్యాంకులు/ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/ అధీకృత ఏటీఎం నెట్ వర్క్
ఆపరేటర్లు/ కార్డు పేమెంట్ నెట్ వర్క్ ఆపరేటర్లు/ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు
మేడమ్/సర్,
ఏటీఎంలు- ఎక్కువ విలువ కలిగిన పాత నోట్ల పంపిణీ నిలిపివేత - కార్యకలాపాల నిలుపుదల
భారత ప్రభుత్వం తక్షణ ఉపసంహరణ ప్రాతిపదికన (నవంబర్ 8, 2016 అర్ధరాత్రి నుండి) 500 రూపాయలు, 1000 రూపాయల విలువ కలిగిన ప్రస్తుత మరియు పాత సిరీస్ లోని నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల, ఈ పాత నోట్లను బ్యాంకులు తమ ఏటీఎంల ద్వారా పంపిణీ చేయడాన్ని నవంబర్ 8, 2016 అర్ధరాత్రి నుండి నిలిపివేయాలి.
2. ఇందుకు సంసిద్ధం కావడానికి అన్ని ప్రభుత్వ రంగ/ప్రైవేటు రంగ/విదేశీ బ్యాంకులు/ RRBలు /గ్రామీణ సహకార/ రాష్ట్ర సహకార బ్యాంకులను నవంబర్ 09, 2016న ప్రజల లావాదేవీల నిమిత్తం మూసి ఉంచాలని ఇప్పటికే ఆయా బ్యాంకులకు సూచించడం జరిగింది.
3. పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని పాత నోట్ల పంపిణీని నివారించడానికి నవంబర్ 8, 2016 అర్ధరాత్రి నుంచి అన్ని బ్యాంకుల ఏటీఎంలను వాటి కార్యకలాపాలను నిర్వహించకుండా మూసివేయాలని నిర్ణయించడమైనది. ఏటీఎంలు కేవలం రూ.50 మరియు రూ.100 నోట్లను మాత్రమే పంపిణీ చేసేలా వాటిని రీకాలిబ్రేట్ చేసిన తర్వాత అవి తిరిగి నవంబర్ 11, 2016 నుండి పని చేయడం ప్రారంభించవచ్చు.
4. ఇందుకోసం బ్యాంకులు మరియు ఏటీఎం స్విచెస్ on-us మరియు off-us కార్యకలాపాల నిమిత్తం వెంటనే అవసరమైన చర్యలను తీసుకోవాలి.
5. అంతే కాకుండా, ఖాతాదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని బ్యాంకులూ డిసెంబర్ 30, 2016 వరకు ఏటీఎంలలో నగదు పంపిణీ సేవలను ఉచితంగా అందించాలి. అంతే కాకుండా బ్యాంకులు తమ ఏటిఎంల వద్ద ఖాతాదారులు నవంబర్ 18, 2016 వరకు కార్డుపై రోజుకు 2000 రూపాయలను మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించాలి.
6. ఈ ఆదేశాలను చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థ చట్టం, 2007 (ACT 51, 2007) లోని సెక్షన్ 10(2) రెడ్ విత్ సెక్షన్ 18 కు అనుగుణంగా జారీ చేయడం జరిగింది.
మీ విశ్వసనీయులు
(నంద S దవే)
చీఫ్ జనరల్ మేనేజర్ |