RBI/2016-17/113
A.P. (DIR సిరీస్) సర్క్యులర్ నెం.16
నవంబర్ 09, 2016
అధీకృత వ్యక్తులందరికీ
సర్/మేడమ్,
ప్రస్తుత మరియు ఇతర పాత సిరీస్ కు చెందిన అన్నిరూ.500 మరియు రూ.1000 నోట్ల
చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు
1. నవంబర్ 08, 2016 అర్ధరాత్రి నుంచి ప్రస్తుత మరియు ఇతర పాత సిరీస్ కు చెందిన అన్నిరూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నవంబర్ 08, 2016న గెజిట్ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్ నెం. S.O.3408(E) ను గమనించమని అధీకృత వ్యక్తులందరినీ కోరడమైనది.
2. అయితే నోటిఫికేషన్ లోని పేరా 1 (g) మరియు(h)లను అనుసరించి, ఆ స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు క్రింద పేర్కొన్న ఇతర కార్యకలాపాల వరకు మాత్రం నవంబర్ 11, 2016 వరకు చట్టబద్ధత కలిగి ఉంటాయి:
(i) స్పెసిఫైఢ్ బ్యాంకు నోట్లు కలిగిన వచ్చిపోయే ప్రయాణికులు అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద, ఐదు వేల వరకు విలువ కలిగిన నోట్లను ఇతర చట్టబద్ధమైన నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు; మరియు
(ii) విదేశీ పర్యాటకులు తమ వద్ద ఉన్న ఐదు వేల వరకు విలువ కలిగిన విదేశీ కరెన్సీని లేదా స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లను ఇతర చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు.
3. అధీకృత వ్యక్తులు పై సూచనలను అనుసరించి ఈ సర్క్యులర్ లోని అంశాలను తమ కింది వారికి తెలియజేయగలరు.
4. ఈ సర్కులర్ లోని సూచనలను విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం, 1999 (42 ఆఫ్ 1999) లోని సెక్షన్ 10 (4) మరియు సెక్షన్ 11 (1) కింద జారీ చేయడం జరిగింది. ఇతర ఏ చట్టం కిందైనా జారీ చేసిన అనుమతులు/ ఆమోదాలకు ఎలాంటి ఆటంకం కలిగించనంతవరకు ఇవి చెల్లుబాటవుతాయి.
మీ విశ్వసనీయులు,
(శేఖర్ భట్నాగర్)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |