RBI/2016-17/123
DCM (Plg). No. 1251/10.27.00/2016-17
నవంబర్ 10, 2016
ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్రభుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
స్థానిక గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/
రాష్ట్ర సహకార బ్యాంకులు
డియర్ సర్,
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - విత్ డ్రా చేసుకునే సొమ్ముపై పరిమితి
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం.DCM (Plg) No.1226/10.27.00/2016-17ను గమనించండి.
2. పైన పేర్కొన్న సర్క్యులర్ లోని పేరా 3.c (iv)ను అనుసరించి, నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నవంబర్ 24, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు, ప్రతి బ్యాంక్ అకౌంట్ నుంచి కౌంటర్ పై విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని రోజుకు రూ.10,000కు, మొత్తంగా వారానికి రూ.20,000కు పరిమితం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిమితిని సమీక్షించడం జరుగుతుంది. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రాపై ఈ క్రింది సందర్భాలలో పై పరిమితులు వర్తించవని స్పష్టం చేయడమైనది:
(i) ఒక బ్యాంకు నుంచి మరొకు బ్యాంకుకు
(ii) పోస్ట్ ఆఫీస్
(iii) అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద పని చేసే ద్రవ్య మారకదారులు మరియు
(iv) వైట్ లేబుల్ ఏటీఎంల ఆపరేటర్లు
3. నగదు సరఫరా విషయంలో కరెన్సీ ఛెస్టులను నిర్వహించే శాఖలు తమకు సమీపంలో ఉండే శాఖల విజ్ఞప్తులకు - లింక్డ్ లేదా ఇతర విధాలుగా- తగిన విధంగా ప్రతిస్పందించాలని సూచించడమైనది.
4. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల డిపాజిట్లను అన్ని రకాల డిపాజిట్లు/లోన్ అకౌంట్లలోకి, CTR/STR రిపోర్టింగ్ కు లోబడి, అనుమతి్‌స్తారు.
మీ విశ్వసనీయులు,
(పి.విజయ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |