RBI/2016-17/106
DCM (CC) No.1170/03.41.01/2016-17
నవంబర్ 02, 2016
ద ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ /
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్
అన్ని బ్యాంకులూ
డియర్ సర్/మేడమ్,
ప్రత్యేకమైన ఏటీఎంల ద్వారా రూ.100 విలువ కలిగిన నోట్ల పంపిణీ
దయచేసి కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం (CEDS) పై మేము మే 5, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (CC) G-10/3352/03.41.01/2015-16 ను పరిశీలించగలరు.
2. బ్యాంకులు తక్కువ విలువ కలిగిన నోట్లను పంపిణీ చేసే ఏటీఎంలను నెలకొల్పిన అంశంపై సమీక్ష నిర్వహించగా, చాలా కొద్ది బ్యాంకులు మాత్రమే రూ.100తో పాటు ఇతర తక్కువ విలువ కలిగిన నోట్లను పంపిణీ చేసే ఏటీఎంలను నెలకొ్ల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది.
3. క్లీన్ నోట్ పాలసీని మరియు రూ.100 బ్యాంకు నోట్ల కొరకు ప్రజల ముఖ్యావసరాలను దృష్టిలో పెట్టుకుని, బ్యాంకులు రిటైల్ వినియోగం కొరకు నోట్లను పంపిణీ చేసే ఏటీఎంల ద్వారా రూ.100 నోట్ల పంపిణీని మరింత పెంచాలి.
4. ఈ దిశగా బ్యాంకులను ప్రోత్సహించడం కొరకు ఒక పైలెట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించడమైనది. ఈ ప్రాజెక్టు కింద దేశంలోని 10 శాతం ఏటీఎంలను కేవలం రూ.100 నోట్లను మాత్రమే పంపిణీ చేసేలా రీకాలిబ్రేట్ చేస్తారు. అందువల్ల కేవలం ఇందుకోసమే పని చేసేలా మీ ఏటీఎంలలో 10 శాతం ఏటీఎంలను కాన్ఫిగర్/కాలిబ్రేట్ చేసుకోవాలని సూచించడమైనది.
5. అవసరమైన ఏటీఎంలను కాన్ఫిగర్ చేసే ప్రక్రియ క్లిష్టమైనదేమీ కాని నేపథ్యంలో బ్యాంకులు ఈ ప్రక్రియను సర్క్యులర్ జారీ చేసిన 15 రోజులలో పూర్తి చేయాలని, పూర్తి అయినట్లు మాకు సమాచారం అందించాలని ఆదేశించడమైనది. ఇందుకోసం బ్యాంకులు శాంపిల్ లో పెద్ద సెంటర్లు/రాష్ట్రాలు ఉండేలా శాఖలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. అలాంటి ఏటీఎంలు ఉన్న ప్రదేశాల గురించిన సమచారాన్ని కూడా మేము జతపరిచిన ఫార్మాట్ లో మాకు పంపగలరు. రెండు నెలలు గడిచిన పిమ్మట మీరు ఈ పైలెట్ ప్రాజెక్టుపై మీ అనుభవాలను మాతో పంచుకోవచ్చు.
6. దయచేసి అందినట్లు తెలుపగలరు.
మీ విశ్వసనీయులు,
(పి . విజయ్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్
Encls.: పైన పేర్కొన్నవి
ప్రత్యేక ఏటీఎంల ద్వారా రూ.100 విలువ కలిగిన బ్యాంకు నోట్ల పంపిణీ
బ్యాంకు పేరు -
క్రమ సంఖ్య |
రాష్ట్రం |
నగరం/పట్టణం/జిల్లా |
ఏటీఎం ఉన్న ప్రాంతం చిరునామా |
|
|
|
|
|
|
|
|
(ఈమెయిల్ ద్వారా పంపాలి) |