RBI/2016-17/125
DCM (Plg). No. 1264/10.27.00/2016-17
నవంబర్ 11, 2016
ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్రభుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
స్థానిక గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/ సహకార బ్యాంకులు
డియర్ సర్,
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - నివేదన మరియు పర్యవేక్షణ
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016 న జారీ చేసిన DCM CO సర్క్యులర్ నెం. DCM (Plg)No.1226/10.27.00/2016-17 లోని పేరా (4) (నివేదిక వ్యవస్థ) ప్రకారం స్పెసిఫైఢ్ బ్యాంకు నోట్ల (SBN) వివరాలన్నీ RBIకు రోజువారీ నివేదికల రూపంలో పంపాలన్న సూచనను గమనించండి. ఈ క్రమంలో బ్యాంకులు పంపే నివేదికలో నగదు మార్పిడితో పాటు అకౌంట్‌లో జమ చేసిన నగదు సమాచారం కూడా ఉండాలని బ్యాంకులకు సూచించడమైనది. అంతే కాకుండా రోజువారీ క్రమంలో ఏవైనా నకిలీ నోట్లు పట్టుబడితే బ్యాంకులు వాటి వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. తదనుగుణంగా మార్పు చేసిన Annex/s 6 మరియు 6A లను జతపరచడమైనది. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ - 6A ను మరుసటి రోజు వ్యాపార లావాదేవీలు ముగిసేలోపు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
2. అంతే కాకుండా, పైన పేర్కొన్న సర్క్యులర్ 2016 లోని పేరా 8ను అనుసరించి, నవంబర్ 11, 2016 వ్యాపార లావాదేవీల సమయం ముగిసే లోపు నోడల్ అధికారి/రుల కాంటాక్ట్ వివరాలను కూడా ఈ క్రింది ఫార్మాట్‌లో అందజేయాలని బ్యాంకులను కోరడమైనది.
బ్యాంకు పేరు |
నోడల్ అధికారి పేరు |
టెలిఫోన్ నెం. |
ఫ్యాక్స్ నెం. |
మొబైల్ నెం. |
మెయిల్ ఐడీ |
|
|
|
|
|
|
(ఎక్సెల్ ఫార్మాట్‌లో పంపాలి)
మీ విశ్వసనీయులు,
(పి.విజయ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్
Annex-6
రూ.500, రూ.1000 విలువ కలిగిన SBNల స్వీకరణ గురించి కంట్రోలింగ్ ఆఫీస్ కు పంపాల్సిన రోజువారీ నివేదిక ఫార్మాట్
బ్యాంకు పేరు : ................................
శాఖ పేరు : .................................... IFSC కోడ్ : .............................
శాఖలో స్వీకరించిన SBNలు.............. ఈ క్రింది వివరాల ప్రకారం ఉన్నాయి:
వివరాలు |
రూ.500(సంఖ్యలలో) |
రూ.1000(సంఖ్యలలో) |
మొత్తం విలువ రూ.లలో |
నగదు రూపంలో మార్పిడి |
|
|
|
అకౌంట్‌లో డిపాజిట్ |
|
|
|
మొత్తం |
|
|
|
గుర్తించిన నకిలీ నోట్లు |
|
|
|
బ్రాంచ్ ఇన్ చార్జ్ పేరు, హోదా : ............................
బ్రాంచ్ ఇన్ చార్జ్ సంతకం : ................................
స్థలం .......................... తేదీ ........................
Annex 6A
రూ.500, రూ.1000 విలువ కలిగిన SBNల స్వీకరణ గురించి RBI, DCM, సెంట్రల్ ఆఫీస్ కు పంపాల్సిన రోజువారీ నివేదిక ఫార్మాట్
బ్యాంకు పేరు: ...............................
లావాదేవీలు జరిగిన తేదీ.....................
స్వీకరించిన SBNల వివరాలు ..............
వివరాలు |
రూ.500(సంఖ్యలలో) |
రూ.1000(సంఖ్యలలో) |
మొత్తం విలువ
రూ.లలో |
నగదు రూపంలో మార్పిడి |
|
|
|
అకౌంట్‌లో డిపాజిట్ |
|
|
|
మొత్తం |
|
|
|
గుర్తించిన నకిలీ నోట్లు |
|
|
|
|