RBI/2016-17/129
DCM (Plg). No. 1272/10.27.00/2016-17
నవంబర్ 13, 2016
ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్రభుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
స్థానిక గ్రామీణ బ్యాంకులు/ పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు
డియర్ సర్,
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు –
నగదు పరిమితి సమీక్ష
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1226/10.27.00/2016-17 ను గమనించండి. సమీక్ష అనంతరం పరిమితులపై కొన్ని మార్పులను చేయడం జరిగింది. అవి:
(i) కౌంటర్ ద్వారా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడి పరిమితిని ప్రస్తుత రూ.4000 నుండి రూ.4500కు పెంచడం జరిగింది.
(ii) రీకాలిబ్రేటెడ్ ఏటీంఎలలో నగదు విత్ డ్రా పరిమితిని ప్రస్తుత రూ.2000 నుంచి రూ.2500కు పెంచడం జరిగింది. ఇతర ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేసేవరకు అవి రూ.50 మరియు రూ.100 నోట్ల పంపిణీని కొనసాగిస్తాయి.
(iii) బ్యాంకు అకౌంట్ల నుంచి వారానికి రూ.20000 ఉన్న నగదు విత్ డ్రా పరిమితిని రూ.24000కు పెంచడం జరిగింది మరియు రోజుకు రూ.10000 మాత్రమే అన్న పరిమితిని తొలగించారు.
2. ప్రభుత్వ పింఛన్ దారులు ప్రతి ఏడాది నవంబర్ లో సమర్పించాల్సిన వార్షిక జీవన సర్టిఫికేట్ గడువు చివరి తేదీని జనవరి 15, 2017 వరకు పొడిగించారు.
3. సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులకు (వికలాంగులు) ప్రత్యేక లైనులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసికోవాలని బ్యాంకులకు సూచించడమైంది. అలాగే SBN నోట్లను మార్చుకోవడానికి వచ్చేవారికి ఒక వరుస, నోట్లను ఖాతాలలో జమ చేసుకోవడానికి వచ్చేవారికి మరో వరుస ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడమైంది.
4. బిజినెస్ కరస్పాండెంట్ల బ్యాంక్ అకౌంట్ల నుండి నగదు విత్ డ్రా పరిమితిని 2,500 రూపాయలకు పెంచాలని బ్యాంకులకు సూచించడం జరిగింది.
5. పైన పేర్కొన్న అన్ని మార్పులూ తక్షణ ప్రాతిపదికన అమల్లోకి రావాలి.
6. దయచేసి అందినట్లు సమాచారం ఇవ్వగలరు.
మీ విశ్వసనీయులు,
(పి. విజయ్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |