RBI/2016-17/135
DCM (Plg). No. 1287/10.27.00/2016-17
నవంబర్ 16, 2016
ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్రభుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
స్థానిక గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు
డియర్ సర్,
స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - ఆదాయ పన్ను నియమాలు, 1962లోని 114B నిబంధనలకు లోబడి ఉండడం.
దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1226/10.27.00/2016-17 ను గమనించండి. ఆదాయ పన్ను నిబంధనలు, 1962లో ఉన్న 114B లోని నిబంధనలకు లోబడి ఉండేందుకు గాను, బ్యాంకులకు ఈ క్రింది సూచనలు చేయడమైనది :
(i) ఒకవేళ ఎవరిదైనా బ్యాంకు అకౌంట్ పాన్ నెంబరుతో సీడ్ చేయబడి ఉండకపోతే, వారు తమ అకౌంట్ లో రూ.50,000కు పైబడి డిపాజిట్ చేయాలనుకుంటే, వారు తమ పాన్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
(ii) పై నిబంధనలకు తోడు, అవే ఐటీ నియమాలలో, ఇతర లావాదేవీల నిమిత్తం కూడా పాన్ నెంబరును పేర్కొనాల్సిన సందర్భాలున్నాయి. వాటి విషయంలో బ్యాంకులు నిక్కచ్చిగా వ్యవహరించాలి.
2. అందువల్ల, బ్యాంకులు పై అంశాలను గమనించి ఆదాయ పన్ను నియమాలు, 1962లో ఉన్న 114B లోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి. ఆదాయ పన్ను నియమాలు, 1962లో ఉన్న 114B లోని సంబంధిత నిబంధనలను జతపరచడం జరిగింది.
మీ విశ్వసనీయులు,
(పి. విజయ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్
Encl: పైన పేర్కొన్నవి |