RBI/2016-17/94
DBR.CID.BC.27/20.16.040/2016-17
అక్టోబర్ 20, 2016
అన్ని పరపతి సంస్థలు
డియర్ సర్/మేడమ్,
ఎక్స్‌పెరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ECICI) సంస్థకు
పరపతి సమాచార వ్యాపార నిర్వహణ కోసం - ‘సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ మంజూరు -
దయచేసి మార్చి 04, 2010న ఎక్స్‌పెరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ECICI)కు ‘సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ మంజూరు చేసే విషయంలో జారీ చేసిన సర్క్యులర్ నెం. DBOD.No.Dl.15214/20.16.042/2009-10 ను దయచేసి గమనించగలరు.
2. ఆ కంపెనీ ఇటీవలే తన కార్యాలయాన్ని మరో చోటికి తరలించింది. తదనుగుణంగా మేము ఆ సంస్థకు అక్టోబర్ 20, 2016న తన పరపతి సమాచార వ్యాపార నిర్వహణ కోసం మళ్లీ కొత్త ‘సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ మంజూరు చేశాము. ఈ కంపెనీ యొక్క కొత్త చిరునామాను కింద ఇవ్వడం జరిగింది:
ఎక్స్‌పెరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్
ఫిఫ్త్ ఫ్లోర్, తూర్పు వింగ్,
టవర్ 3, ఎల్ బీ ఎస్ మార్గ్,
కుర్లా (పశ్చిమం)
ముంబై 400 070
మీ విశ్వసనీయులు,
(రాజిందర్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |