RBI/2016-17/96
IDMD.CDD.No.892/14.04.050/2016-17
అక్టోబర్ 20, 2016
ద ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు,
(RRBలు కాకుండా ఇతర బ్యాంకులు)
గుర్తించిన పోస్టాఫీసులు,
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి. (SHICL)
జాతీయ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఇండియా లి. మరియు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లి.
డియర్ సర్/మేడమ్,
ప్రభుత్వ గోల్డ్ బాండ్ లు - గరిష్ట పెట్టుబడి పరిమితి మరియు
పూచీక త్తుగా వాటి స్వీకరణ - వివరణ
భారత ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీల యాక్ట్, 2006 (38 ఆఫ్ 2006) సెక్షన్ 3 లోని నిబంధన (iii) ప్రకారం ప్రభుత్వ గోల్డ్ బాండ్ల పథకాన్ని నోటిఫై చేసిన విషయం మీకు తెలిసిందే. ఈ బాండ్ల గరిష్ట సబ్ స్క్రిప్షన్ పరిమితి ఒక వ్యక్తికి, ఆర్థిక సంవత్సరానికి 500 గ్రాములు అని ఈ పథకంలో పేర్కొనడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి మేము బ్యాంకులు మరియు ఇతరుల నుంచి ఈ బాండ్లను పూచీకత్తుగా పెట్టుకుని రుణం తీసుకోవడం గురించి మరియు సబ్ స్క్రిప్షన్ పరిమితులు ట్రాన్స్ ఫర్ ద్వారా పొందిన వాటికి కూడా వర్తిస్తాయా అన్నదానిపై పలు ప్రశ్నలను అందుకొంటున్నాము.
అందువల్ల, ఈ క్రింది వివరణను ఇవ్వడం జరుగుతోంది:
a) ప్రభుత్వ గోల్డ్ బాండ్లు (SGBలు) భారత ప్రభుత్వ సెక్యూరిటీల చట్టంలోని సెక్షన్ 3 (iii) ప్రకారం జారీ చేయబడినవి. SGBలను కలిగి ఉన్నవారు ఈ సెక్యూరిటీలను ఎవరికైనా పూచీకత్తుగా (pledge) లేదా హైపోథికేషన్ (hypothecation) లేదా లీన్ (lien) పెట్టే అధికారం కలిగి ఉన్నందున (G-Sec Act 2006/ G.Sec Regulations, 2007లోని నిబంధనలకు అనుగుణంగా) SGBలను ఏవైనా రుణాలకు హామీగా ఉపయోగించుకొనవచ్చును.
b) బ్యాంకులు మరియు అర్హత కలిగిన హోల్డర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్ ఫర్ లు మొదలైన వాటి ద్వారా, రికవరీ ప్రొసీడింగ్స్ ద్వారా అయ్యే ట్రాన్స్ ఫర్ లను కలుపుకుని, 500 గ్రాములకన్నా ఎక్కువ బంగారాన్నిపొందవచ్చు.
మీ విశ్వసనీయులు,
(రాజేంద్ర కుమార్)
జనరల్ మేనేజర్ |