Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (104.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/10/2016
నకిలీ నోట్ల గుర్తింపు మరియు వాటిని స్వాధీన‌ప‌ర‌చుకోవ‌డం:

RBI/2016-17/102
DCM (FNVD) No.1134/16.01.05/2016-17

అక్టోబర్ 27, 2016

ద ఛైర్మ‌న్‌ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్
అన్ని బ్యాంకులూ

డియ‌ర్ స‌ర్‌/మేడ‌మ్‌,

నకిలీ నోట్ల గుర్తింపు మరియు వాటిని స్వాధీన‌ప‌ర‌చుకోవ‌డం:

కొ్న్ని అసాంఘిక శ‌క్తులు కొంత మంది ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా తీసుకుని సాధార‌ణ కార్య‌క‌లాపాల‌లో భాగంగా ఎక్కువ విలువ క‌లిగిన భారత న‌కిలీ నోట్ల‌ను చలామణిలోకి తీసుకు వస్తున్నట్టు మాకు సమాచారం అందింది.

2. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న (కాపీని జత చేయడం జరిగింది) ద్వారా, నోట్లను తీసుకొనే ముందు వాటిని ఒకసారి జాగ్ర‌త్త‌గా ప‌రీశీలించవలసిందిగా, త‌ద్వారా న‌కిలీ నోట్ల చలామణి అరిక‌ట్ట‌డానికి స‌హ‌క‌రించాల్సిందిగా కోరడమయినది.

3. దీనికి సంబంధించి ద‌య‌చేసి జులై 20, 2016న న‌కిలీ నోట్ల గుర్తింపు మ‌రియు వాటిని స్వాధీన‌ప‌ర‌చుకోవ‌డంపై విడుద‌ల చేసిన మాస్ట‌ర్ స‌ర్క్యుల‌ర్ నెం. DCM (FNVD) No.G-6/16.01.05/2016-17 ను చూడగలరు. దీనిలో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌వేశించే న‌కిలీ నోట్ల‌ను వెంట‌నే గుర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని, ఎలాంటి ప‌రిస్థితుల‌లోను వాటిని ఇచ్చిన వ్య‌క్తికి తిరిగి ఇవ్వ‌డం కానీ, ఇత‌రుల‌కు ఇవ్వ‌డం కానీ చేయ‌రాద‌ని సూచించ‌డ‌మైన‌ది. న‌కిలీనోట్ల‌ను గుర్తించ‌డానికి అన్ని బ్యాంకుల శాఖ‌లు/గుర్తించిన బ్యాక్ ఆఫీసులు త‌మ వ‌ద్ద అల్ట్రా వ‌యోలెట్ ల్యాంపులు/ ఇత‌ర బ్యాంక్ నోట్ సార్టింగ్‌/ గుర్తింపు మెషీన్లు ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా, బ్యాంకులు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన రూ.100కు పైబ‌డిన నోట్లు నిజ‌మైన‌వే అని నిర్ధార‌ణ కానంత వ‌ర‌కు వాటిని రీస‌ర్క్యులేట్‌ చేయ‌రాద‌ని సూచించ‌డ‌మైన‌ది. ఈ సూచ‌న‌ల‌న్నీ అన్ని బ్యాంకుల శాఖ‌ల‌కూ, అవి రోజూ ఎంత ప‌రిమాణంలో న‌గ‌దును స్వీక‌రించిన‌ప్ప‌టికీ, వ‌ర్తిస్తాయి. వీటిల్లో ఏ ఒక్క సూచ‌న‌ను పాటించక పోయినా న‌వంబ‌ర్ 19, 2009న జారీ చేసిన డైరెక్టివ్ నెం.3158/09.39.00(Policy)/2009-10ను ఉల్లంఘిచ్చిన‌ట్లుగా ప‌రిగణించాల్సి వస్తుంది.

4. అంతే కాకుండా బ్యాంకులో నగదు లావాదేవీలు నిర్వహించే సిబ్బంది (ఫ్రంట్ లైన్ మరియు బ్యాక్ ఆఫీస్) తప్పనిసరిగా బ్యాంకు నోట్ల యొక్క భ‌ద్ర‌తాంశాల‌పై శిక్ష‌ణ పొంది ఉండాలి. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులకు న‌కిలీ నోట్ల‌ను గుర్తించ‌డ‌మెలాగో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు మా వెబ్ సైట్ https://paisaboltahai.rbi.org.in/ ను సంద‌ర్శించ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

5. నకిలీ నోట్లను చ‌లామణీలోకి తీసుకు రావాలని ప్ర‌యత్నిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా బాంకులు బ్యాంకింగ్ హాల్/ప్రాంతం మ‌రియు కౌంట‌ర్ల వ‌ద్ద సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వాటి రికార్డులను భద్రపరచాలి.

6. బ్యాంకులు న‌కిలీనోట్ల‌ను గుర్తించ‌డంలో, వాటిని స్వాధీనం చేసుకోవ‌డంలో, అలాంటి నోట్లు తిరిగి పంపిణీ కాకుండా చూడ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయంటే అది మేము పైన పేర్కొన్న సూచ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది. దీనిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

7. దయచేసి అందిన‌ట్లు తెలుప‌గ‌ల‌రు.

మీ విశ్వ‌స‌నీయులు,

(పి . విజయ్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్

Encls.: పైన పేర్కొన్న‌వి

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….