RBI/2016-17/208
A.P. (DIR Series) Circular No. 24
జనవరి 03, 2017
అధీకృత వ్యక్తులందరికీ,
మేడమ్/సర్,
విదేశీ పౌరులకు మార్పిడి సదుపాయం
విదేశీ పౌరులు డిసెంబర్ 15, 2016 వరకు వారానికి రూ.5000 పరిమితితో తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీని భారత కరెన్సీ నోట్ల రూపంలోకి మార్చుకొనేందుకు నవంబర్ 25, 2016న జారీ చేసిన A.P. (DIR Series) Circular No. 20, మరియు ఆ గడువును డిసెంబర్ 31, 2016 వరకు పొడిగిస్తూ డిసెంబర్ 16, 2016న జారీ చేసిన A.P. (DIR Series) Circular No. 22 ను గమనించమని అధీకృత వ్యక్తులందరికీ సూచించడమైనది.
2. సమీక్ష అనంతరం నవంబర్ 25, 2016న జారీ చేసిన A.P. (DIR Series) Circular No. 20లో జారీ చేసిన సూచనలను జనవరి 31, 2017 వరకు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది.
3. అధీకృత వ్యక్తులందరూ పైన పేర్కొన్న సూచనలను అనుసరించి, ఈ సర్క్యులర్ లోని అంశాలను తమ కింద ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చు.
4. ఈ సర్క్యులర్ లో జారీ చేసిన మార్గదర్శకాలను విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (42 ఆఫ్ 1999) లోని సెక్షన్ 10 (4) మరియు సెక్షన్ 11 (1) కింద, ఇతర ఏ చట్టంలోని అనుమతులు/ఉత్తర్వులకు ఎలాంటి ఆటంకమూ కలిగించని విధంగా జారీ చేయడం జరిగింది.
మీ విశ్వసనీయులు,
(శేఖర్ భట్నాగర్)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్
|