RBI/2016-17/202
DPSS.CO.PD. No.1621/02.10.002/2016-17
డిసెంబర్ 30, 2016
ద ఛైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
RRB లు సహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు/
పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/
అధీకృత ఏటీఎం నెట్ వర్క్ ఆపరేటర్లు/కార్డ్ పేమెంట్ నెట్ వర్క్ ఆపరేటర్లు/
వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు
డియర్ సర్,
వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAO) - రిటైల్ ఔట్ లెట్ల నుంచి నగదు స్వీకరణ
నవంబర్ 08, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No. 1226/10.27.00/2016-17 ద్వారా ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధ చలామణి రద్దు నేపథ్యంలో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOలు) తమ స్పాన్సర్ బ్యాంకు(ల) నుంచి నగదు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది.
2. WLAOలకు నగదు లభ్యత ఉండేలా చూసేందుకు, ఈ క్రింది షరతులకు లోబడి, అవి రిటైల్ ఔట్ లెట్ల నుంచి నగదును పొందే అవకాశాన్ని కల్పించడమైనది.
ఎ) ఏటీఎంల ద్వారా పంపిణీ చేసే కరెన్సీ నోట్ల నాణ్యత మరియు అవి అసలైనవే అని చూసుకోవాల్సిన బాధ్యత WLAOలదే. ఇందుకోసం కేవలం ఏటీఎంలలో అమర్చదగిన నోట్లను మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
బి) WLAOలు తాము ఎక్కడి నుంచి నగదును పొందాలనుకుంటున్నాయో ఆ రిటైల్ ఔట్ లెట్ లతో తమ బోర్డు ఆమోదిత విధానాలకు అనుగుణంగా వాటితో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.
సి) అలాంటి ఏర్పాట్ల కారణంగా తలెత్తే ఏవైనా వివాదాలు, జవాబుదారీతనం, పూచీకత్తు తదితర వాటికి WLAOలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
డి) ఖాతాదారుల వివాదాలను పరిష్కరించే బాధ్యతను WLAOలే తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఎవరైనా ఖాతాదారునికి నకిలీ నోట్లు సహా ఇతర ఏ విధమైన సమస్య తలెత్తినా వాటి వల్ల కలిగే నష్టాన్ని WLAOలే భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఇ) ఇలాంటి ఏర్పాట్ల ద్వారా సేకరించిన నగదులో 60 శాతం నగదును గ్రామీణ మరియు సెమీ అర్బన్ (అర్ధ పట్టణ) ప్రాంతాలలో ఉన్న WLAల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఎఫ్) WLAOలకు సంబంధించిన ఇతర నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు.
3. ఈ సర్క్యులర్ జారీ అయిన తేదీ నుంచి పైన పేర్కొన్న ఏర్పాట్లు అమలులోకి వస్తాయి. వాటిని ఏ విధంగా అమలు చేయాలి, ఎప్పటివరకు ఉంటాయన్నది సమీక్షకు లోబడి ఉంటుంది.
4. ఈ ఆదేశాన్ని పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 (యాక్ట్ 51 ఆఫ్ 2007) లోని సెక్షన్ 10 (2) మరియు విత్ సెక్షన్ 8కు అనుగుణంగా జారీ చేయడం జరిగింది.
మీ విశ్వసనీయులు,
(నీలిమా రామ్‌టెకె)
జనరల్ మేనేజర్ |