RBI/2016-17/203
DPSS.CO.PD. No.1669/02.14.006/2016-2017
డిసెంబర్ 30, 2016
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్ జారీదారులు,
సిస్టమ్ ప్రొవైడర్లు, సిస్టమ్ పార్టిసిపెంట్స్
ఇతర భావి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్ జారీదారులు
డియర్ సర్/మేడమ్,
ఎలెక్ట్రానిక్ చెల్లింపులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు- గడువు పొడిగింపు
దయచేసి, కనీస వివరాలతో జారీ చేసిన సెమీ-క్లోజ్డ్ PPIల పరిమితిని మరియు PPIలను ఉపయోగించే చిన్న వ్యాపారులకు ప్రత్యేక నగదు పంపిణీ పరిమితిని పెంచాలని సూచిస్తూ నవంబర్ 22, 2106 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DPSS.CO.PD. No.1288/02.14.006/ 2016-17 ను గమనించండి.
2. దేశంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI) జారీ విషయంలో మార్గదర్శకాలు మరియు దాని ఫ్రేమ్ వర్క్ పై రిజర్వ్ బ్యాంక్ ఒక సమగ్రమైన సమీక్ష చేపడుతున్న నేపథ్యంలో (దయచేసి సెప్టెంబర్ 2, 2016న జారీ చేసిన ప్రెస్ రిలీజ్ ను చూడండి) పైన పేర్కొన్న సర్క్యులర్ లోని సూచనలను PPI మార్గదర్శకాల సమీక్ష పూర్తయ్యే వరకు కొనసాగించాలని నిర్ణయించడమైనది.
3. ఈ ఆదేశాన్ని పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 (యాక్ట్ 51 ఆఫ్ 2007) లోని సెక్షన్ 10 (2) మరియు సెక్షన్ 8కు అనుగుణంగా జారీ చేయడం జరిగింది.
మీ విశ్వసనీయులు,
(నీలిమా రామ్‌టెకె)
జనరల్ మేనేజర్ |