RBI/2016-17/243
DGBA.GAD.No.2294/15.04.001/2016-17
మార్చి 6, 2017
అన్ని ఏజెన్సీ బ్యాంకులు
మాడమ్/డియర్ సర్,
గోల్డ్ మోనిటైజేషన్ పథకం
దయచేసి పైన పేర్కొన్న విషయంపై అక్టోబర్ 22, 2015 నాటి ఆర్బిఐ మాస్టర్ డైరెక్షన్ డిబిఆర్.ఐబిడి. సంఖ్య 45/23.67.003/2015-16 (జనవరి 21, 2016 వరకు నవీకరించబడింది) ను చూడండి. ఫై పథకం అమలుచేయడం విషయంలో ఈ క్రింది విధంగా సూచిస్తున్నాము.
2. రిపోర్టు, సయోధ్య మరియు అకౌంటింగ్ లలో ఏకరీతి కలిగి ఉండటానికి, ఏజెన్సీ బ్యాంకులు గోల్డ్ మోనిటైజేషన్ పథక లావాదేవీలు అంటే, రసీదులు, చెల్లింపు, పెనాల్టీ వడ్డీ, సమీకరణ కొరకు కమీషన్, నిర్వహణ ఛార్జీలు మొదలైనవాటిని, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం, 1968 నాటి లావాదేవీల విషయంలో లాగా నేరుగా రోజువారీ ప్రాతిపదికన, సెంట్రల్ అకౌంట్స్ సెక్షన్ (CAS), భారతీయ రిజర్వు బ్యాంకు, నాగపూర్ కు నివేదించవచ్చును. అందువల్ల, గోల్డ్ మోనిటైజేషన్ పథకం వివరాలు తక్షణమే నివేదించడానికి అవసరమైన ఏర్పాట్ల కోసం CAS, RBI, నాగపూర్ ను మీరు సంప్రదించవచ్చు
3. పథకాన్ని అమలు చేయడానికి అధికారం కలిగిన శాఖలు, వారి వినియోగదారుల దృష్టికి ఈ పథకం వివరాలను తెలియచేయాలని కోరడమైనది.
మీ విధేయులు,
(పార్థా చౌదరి) జనరల్ మేనేజర్
|