RBI/2016-17/256
DBR.No.Leg.BC.55/09.07.005/2016-17
మార్చ్ 24, 2017
అన్నిప్రాతినిధ్య బ్యాంకులకు
అయ్యా/అమ్మా,
అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు, ప్రతిరోజూ ప్రజల సౌకర్యంకోసం తెరిచి ఉంచాలి
భారత ప్రభుత్వం, వారి వసూళ్ళు, చెల్లింపుల లావాదేవీలు జరుపుటకు వీలుగా అన్ని పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఏప్రిల్ 1, 2017 వరకు, ప్రతిరోజూ తెరిచి ఉంటాయని తెలిపింది. తదనుసారంగా, ప్రభుత్వ లావాదేవీలు జరిపే ప్రాతినిధ్య బ్యాంకుల అన్ని శాఖలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రోజులు, మరియు ఏప్రిల్ 1, 2017 తేదీన (శనివారాలూ, ఆదివారాలు మరియు శెలవు దినాలతో సహా) తెరిచి ఉంచాలని సూచన.
ఈ తేదీల్లో, పైన వివరించిన బ్యాంకింగ్ సేవల లభ్యత గురించి బ్యాంకులు ఉచితరీతిలో ప్రచారం చేయవలెను.
మీ విధేయులు,
(రాజిందర్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |