RBI/2016-17/258
FIDD.CO.LBS.BC.No.24/02.08.001/2016-17
మార్చ్ 27, 2017
చైర్‌మెన్ & మానేజింగ్ డైరెక్టర్లు
అన్ని లీడ్ బ్యాంకులు
అయ్యా/అమ్మా,
మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
మణిపూర్ రాష్ట్రంలో క్రొత్తగా ఏర్పరిచిన ఏడు జిల్లాల్లో లీడ్ బ్యాంకు బాధ్యతలు అప్పగిస్తూ మాచే మార్చ్ 9, 2017 తేదీన జారీ చేయబడ్డ సర్క్యులర్ FIDD.CO.LBS.BC.No.23/02.08.001/2016-17, దయచేసి చూడండి.
2. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, సేనాపతి మరియు కాంగ్‌పోక్పి (Senapati and Kangpokpi) జిల్లాల అంతర్విభజన ఈ క్రింద సూచించిన విధంగా సరిదిద్దుతూ, డిసెంబర్ 14, 2016 తేదీన, గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
క్రమ సంఖ్య |
క్రొత్తగా సృష్టించిన జిల్లా |
పాత జిల్లా |
క్రొత్తగా సృష్టించిన జిల్లా అంతర్విభజన |
లీడ్ బ్యాంక్ బాధ్యత అప్పగింత |
క్రొత్త జిల్లాకు కేటాయించిన వర్కింగ్ కోడ్ |
1 |
సేనాపతి |
సేనాపతి |
(i) తాడుబి (ii) పవొమాతా (iii) పురుల్ (iv) విల్లాంగ్ (v) చిలివై ఫైబుంగ్ (vi) సాంగ్-సాంగ్ మరియు (vii) లైరౌచింగ్ |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
150 |
2 |
కాంగ్‌పోక్పి |
సేనాపతి |
(i) కాంగ్‌పోక్పి (ii) చాంఫై (iii) సైతు గంఫాజోల్ (iv) కాంగ్‌చుప్ గెల్జాంగ్ (v) తూయ్‌జాంగ్ వైచోంగ్ (vi) సైకుల్ (vii) లూంగ్‌టిన్ (viii) ఐలాండ్ మరియు (ix) బుంగ్టె చిరు |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
388 |
3. పైన తెలిపిన మార్చ్ 9, 2017 తేదీ సర్క్యులర్‌లో ఏ ఇతర మార్పూ లేదు.
మీ విధేయులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్ |