RBI/2016-17/260
DPSS.CO.CHD.No./2720/03.01.03/2016-17
మార్చ్ 29, 2017
చైర్‌మెన్ మరియు మానేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)/
పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/ జిల్లా కేంద్ర సహకార
బ్యాంకులు/ప్రాంతీయ బ్యాంకులు
అయ్యా/అమ్మా,
అన్ని చెల్లింపు విధానాలు, ఏప్రిల్ 1, 2017 తేదీన మూసి ఉంటాయి
మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని శెలవు దినాలతో సహా), అన్ని చెల్లింపు విధానాలు (RTGS మరియు NEFT తో సహా) మిగిలిన పనిరోజులవలె యథావిధిగా పనిచేయాలని సూచిస్తూ, మాచే జారీ చేయబడ్డ సర్క్యులర్ RBI/2016-17/257 DPSS.CO.CHD.No./2695/03.01.03/2016-17 తేదీ మార్చ్ 25, 2017, చూడండి. ఈ విషయమై పునఃపరిశీలన అనంతరం, అన్ని చెల్లింపు విధానాలు, ఏప్రిల్ 1, 2017 తేదీన, మూసి ఉంచాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రసార సందేశం (broadcast message) సభ్యులైన బ్యాంకులకు, వ్యక్తిగత వ్యవస్థ ద్వారా జారీ చేయబడుతుంది.
2. ఈ సందర్భంగా, మార్చ్ 23, 2017 తేదీన, RBI/2016-17/255 DPSS. CO.CHD.No./2656/03.01.03/2016-17 ద్వారా, మాచే జారీ చేయబడ్డ ఆదేశాల్లో (మార్చ్ 30 మరియు 31, 2017 తేదీలలో, ప్రత్యేక క్లియరింగ్ ప్రక్రియ నిర్వహించడంపై), ఏ మార్పూ లేదని స్పష్టపరచడమైనది.
మీ విధేయులు,
(నందా ఎస్ దవే)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ |