RBI/2016-17/275
FIDD.FLC.BC.No.27/12.01.018/2016-17
ఏప్రిల్ 13, 2017
చైర్‌మెన్/మేనేజింగ్ డైరెక్టర్/సిఇఒ
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)
అయ్యా / అమ్మా,
ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం
ఆర్థిక అక్షరాస్యతయొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి జూన్ 5 నుండి 9, 2017 వరకు, దేశమంతా ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం పాటించాలని నిర్ణయించడం జరిగింది.
2. అక్షరాస్యతా సప్తాహంలో, స్థూలంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది – 'మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి' (KYC), రుణ వ్యవహారాల్లో క్రమశిక్షణ, ఫిర్యాదుల పరిష్కారం మరియు ఆర్థిక కార్యకలాపాలు డిజిటల్‌గా జరపడం (UPI మరియు *99#). పైన పేర్కొన్న అంశాల గురించి సామాన్య ప్రజలకు తెలుపవలసిన సందేశాలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక అక్షరాస్యత 'వెబ్ పేజ్', 'డౌన్‌లోడ్స్' విభాగంలో, 'ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం' క్రింద లభిస్తాయి.
3. బ్యాంక్ శాఖల్లో ప్రదర్శించడానికి ప్రాంతీయ భాషల్లో పోస్టర్లు (A3 సైజ్); క్యాంపుల్లో (శిక్షణ శిబిరాలు, camps) పాల్గొన్న వారికి పంచడానికి 'కరపత్రాలు' (flyers) (A5 సైజ్); క్యాంపుల్లో శిక్షకులు ఉపయోగించడానికి చార్టులు (చిత్రపటాలు, charts) (A2 సైజ్), భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రాంతీయ కార్యాలయాలచే ముద్రించబడి, సమకూర్చబడతాయి. ప్రతి బ్యాంక్ శాఖకు, 5, A3 సైజ్ పోస్టర్లు (5 పోస్టర్లు కలిగిన ఒక సెట్) అందజేయబడతాయి. ప్రతి గ్రామీణ శాఖకు, అదనంగా 500, A5 సైజ్ కరపత్రాలు (5 కరపత్రాలు కలిగిన 100 సెట్లు) బ్యాంక్ శాఖల్లో, శిక్షణ శిబిరాల్లో పంచడానికి ఇవ్వబడతాయి. ఇంకా, 5, A2 సైజ్ చార్టులు (5 చార్టులు కలిగిన ఒక్ సెట్) క్యాంపులు నిర్వహించేటప్పుడు ఉపయోగించడానికి, గ్రామీణ శాఖల మానేజర్లకు ఇవ్వబడతాయి. ఆర్థిక అక్షరాస్యతా సలహాదార్లు (FLC counsellors) క్యాంపులు నిర్వహించేటప్పుడు వినియోగించడానికి, ప్రతి ఆర్థిక అక్షరాస్యతా కేంద్రానికి 5, A2 సైజ్ చార్టులు (5 చార్టులు కలిగిన ఒక సెట్) మరియు క్యాంపుల్లో పాల్గొన్నవారికి పంచడానికి 1000, A 5 కరపత్రాలు ( 5 కరపత్రాలు కలిగిన 200 సెట్లు) సమకూర్చబడతాయి.
4. బ్యాంకులు, పోస్టర్లు, కరపత్రాలు, చార్టులు రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల నుండి మే నెల, మొదటి రెండు వారాల్లో తీసికొని, వారి శాఖలకు, FLC లకు అక్షరాస్యతా సప్తాహానికి తగినంత ముందే పంపిణీ చేసే ఏర్పాట్లు చేయవలెనని సూచన.
5. సప్తాహంలో, ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళిక:
-
బ్యాంకులు వారి ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలను (FLCs), ఐదు రోజుల్లో ప్రతి రోజూ వెనుకబడ్డ/ బ్యాంకులు లేని ప్రాంతాల్లో, ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించాలి. FLC సలహాదారులు, శిక్షణకై A2 సైజ్ చార్టులు వినియోగించవలెను. క్యాంప్‌లో పాల్గొన్నవారికి, A5 సైజ్ ప్రచార సామగ్రి పంచిపెట్టవలెను.
-
దేశంలోని అన్ని బ్యాంక్ శాఖలు, వారి ప్రాంగణంలో, ప్రముఖ స్థానాల్లో, ఐదు సందేశాలపై ప్రాంతీయ భాషల్లో A3 సైజ్ పోస్టర్లు ప్రదర్శించవలెను. ఈ పోస్టర్లు, ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం ముగిసిన తరువాతకూడా, ఆరు నెలలపాటు, బ్యాంక్ శాఖల ప్రాంగణంలో ప్రదర్శించి ఉంచవలెను.
-
బ్యాంకులు, ప్రతి రోజు ఒక సందేశాన్ని వారి వెబ్‌సైట్, హోంపేజ్‌లో ఇంగ్లీష్ మరియు హిందీలో ప్రదర్శించవలెను. ఇంతేగాక, దేశంలోని వారి అన్ని ATM ల తెరలపై, ప్రతి రోజూ ఒక సందేశం, ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషల్లో (అనుబంధం) ప్రదర్శించవలెను.
-
అన్ని గ్రామీణ శాఖలూ, సప్తాహం ఇదు రోజుల్లో ఏదో ఒక రోజు, పని వేళల తరువాత, క్యాంప్ నిర్వహించవలెను.
-
ఆర్హ్తిక అక్షరాస్యతపై ఉత్సుకతని, అవగాహనని కల్పించడానికి, నాలుగు అంశాల మీద ‘ఆన్‌లైన్‌లో’ ఒక ప్రశ్నల పోటీ (quiz) నిర్వహించబడుతుంది. దీని వివరాలు, మా వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా, త్వరలో తెలుపబడతాయి.
6. ఈ ఆర్థిక సప్తాహంలో, సామాన్య ప్రజలకు చేరువ కావాలని మా కృషి. ఈ మా ప్రయత్నం ఘన విజయాన్ని సాధించడానికి, బ్యాంకింగ్ పరిశ్రమనుండి హార్దిక సహకారం ఆశిస్తున్నాము.
మీ విధేయులు,
(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్
జతపరచినవి: పైన సూచించినవి |