ఆర్బిఐ/2017-18/60
FIDD.CO.LBS.BC.No.15/02.08.001/2017-18
సెప్టెంబర్ 21, 2017
అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకులు
ముఖ్య కార్య నిర్వహణ అధికారి
అన్ని లీడ్ బ్యాంకులు
మాడమ్/డియర్ సర్,
బెంగాల్ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు– లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, మార్చి 20, 2017 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా క్రొత్త జిల్లా "ఝార్గ్రామ్" ను ఏప్రిల్ 4, 2017 నుండి మరియు మార్చి 24, 2017 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా క్రొత్త జిల్లా "పశ్చిమ్ బర్ధమాన్" ను ఏప్రిల్ 7, 2017 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. క్రింద పేర్కొన్న విధంగా క్రొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించడమైనది:
క్రమ సంఖ్య |
క్రొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా |
పూర్వపు జిల్లా |
క్రొత్తగా ఏర్పడిన జిల్లాల ఉపవిభాగాల పేర్లు |
లీడ్ బ్యాంక్ బాధ్యత అప్పగించిన
బ్యాంకు |
క్రొత్త జిల్లాకు కేటాయించిన జిల్లా వర్కింగ్ కోడ్ |
1 |
పశ్చిమ్ మేదినిపూర్ |
పశ్చిమ్ మేదినిపూర్ |
మేదినిపూర్ సదర్ ఖరగపూర్ ఘటల్ |
యునైటెడ్ బ్యాంక్ అఫ్ ఇండియా |
112 |
2 |
ఝార్గ్రామ్ |
పశ్చిమ్ మేదినిపూర్ |
ఝార్గ్రామ్ సదర్ |
యునైటెడ్ బ్యాంక్ అఫ్ ఇండియా |
398 |
3 |
పూర్బ బర్ధమాన్ |
పూర్బ బర్ధమాన్ |
బర్ధమాన్ సదర్ నార్త్ బర్ధమాన్ సదర్ సౌత్ కట్వా, కల్న |
యూకో బ్యాంకు |
399 |
4 |
పశ్చిమ్ బర్ధమాన్ |
పూర్బ బర్ధమాన్ |
అసన్సోల్ సదర్, దుర్గాపూర్ |
భారతీయ స్టేట్ బ్యాంకు |
403 |
2. బ్యాంకుల ద్వారా BSR రిపోర్టింగ్ కొరకు క్రొత్త జిల్లాల జిల్లా వర్కింగ్ కోడ్ కేటాయించడమైనది.
3. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో మార్పు లేదు.
మీ విధేయులు,
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్ |