ఆర్బిఐ/2017-18/59
DCBR.RAD.(PCB/RCB) Cir. No. 4/07.12.001/2017-18
సెప్టెంబర్ 21, 2017
అన్ని సహకార బ్యాంకులు
మాడమ్/డియర్ సర్,
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో,
"గోపినాథ్ పాటిల్ పార్సిక్ జనతా సహకారీ బ్యాంక్, లిమిటెడ్, థానే" పేరును
"జిపి పార్సిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్, కల్వా, థానే" గా మార్చడమైనది
నోటిఫికేషన్ DCBR.RAD.(PCB). సంఖ్య. 1 / 08.02.205 / 2016-17, మార్చి 15, 2017 ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూల్ లో "గోపినాథ్ పాటిల్ పార్సిక్, జనతా సహకరి బ్యాంక్, లిమిటెడ్, థానే" పేరును "జిపి పార్సిక్ సహకారీ బ్యాంకు లిమిటెడ్, కల్వా, థానే" గా మార్చామని సూచిస్తున్నాము. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజిట్, (పార్ట్ III – సెక్షన్ 4), సెప్టెంబర్ 02, 2017 నందు ప్రచురించబడినది.
మీ విధేయులు,
(నీరజ్ నిగమ్)
చీఫ్ జనరల్ మేనేజర్
|