ఆర్బిఐ/2017-18/79
DGBA.GBD.No.1007/15.04.001/2017-18
అక్టోబర్ 17, 2017
అన్ని ఏజెన్సీ బ్యాంకులు
మాడమ్ / డియర్ సర్,
గోల్డ్ మోనిటైజేషన్ పథకం, 2015
దయచేసి మార్చి 6, 2017 సర్కులర్ సంఖ్య DGBA.GAD. 2294 / 15.04.001 / 2016-17 తో పైన పేర్కొన్న విషయంపై అక్టోబర్ 22, 2015 ఆర్బిఐ మాస్టర్ డైరెక్షన్ డిబిఆర్.ఐబిడి. సంఖ్య 45 / 23.67.003 / 2015-16 (మార్చి 31, 2016 వరకు నవీకరించబడింది) ను చూడండి.
2. మధ్య మరియు దీర్ఘ కాలిక ప్రభుత్వ డిపాజిట్ (MLTGD) లకు సంబంధించి బ్యాంకులు చేసిన చెల్లింపులను తిరిగి సెంట్రల్ అకౌంట్ సెక్షన్ (CAS, నాగపూర్), భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా చెల్లించాలని నిర్ణయించడమైనది.
3. ఈవిధంగా, బ్యాంకులు డిపాజిట్ల పై బకాయి వడ్డీని వెంటనే చెల్లించాలి మరియు భవిష్యత్తులో డిపాజిటుదారులకు వడ్డీని ఆయా నిర్ణీత గడువు తేదీలలో చెల్లించాలి. చెల్లింపుల తరువాత, ఆ క్లైములు (claims) బ్యాంకులు ప్రభుత్వానికి, భారతీయ రిజర్వు బ్యాంకు (CAS, నాగపూర్), ద్వారా పంపవచ్చు.
మీ విధేయులు,
(డి. జె. బాబు)
డిప్యూటీ జనరల్ మేనేజర్
|