ఆర్.బి.ఐ/2017-18/103
డి.జి.బి.ఏ/జీ.బి.డి.నం/1472/31.02.007/2017-18.
నవంబర్ 30, 2017
అన్ని ఏజెన్సీ బ్యాంకులు
డియర్ సర్/మేడమ్,
ఏజెన్సీ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుకు లావాదేవీలు నివేదించడం (రిపోర్టింగ్)
సంబంధిత ప్రభుత్వశాఖ నుండి అవసరమైన ఉత్తరువు (ఆధరైజేషణ్) తీసుకోకుండా, కొన్ని ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ లావాదేవీలను చెప్పుకోదగ్గ ఆలస్యంతోనూ మరియు వర్తమాన లావాదేవీలతోపాటుగా రిజర్వ్ బ్యాంకుకు నివేదిస్తునారని మా దృష్టికి తీసుకురాబడింది.
2. ఇపుడున్న ఆదేశాల ప్రకారం, క్రితం నెలలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలు (ఎలక్ట్రానిక్ మరియు ఫిజికల్ మోడ్ లలో) తదుపరి నెల ఎనిమిదవ (8th) తారీఖు తరువాత నివేదింపబడతాయి మరియు ముందునెలలకు సంబంధించిన లావాదేవీలు తత్సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ దక్షతాధికారులచే నిర్ధారించబడిన తరువాత, ప్రత్యేక నివేదిక ద్వారా అకౌంటింగ్ కోసం రిజర్వ్ బ్యాంకుకు నివేదింపబడతాయి.
3. కేంద్ర ప్రభుత్వ లావాదేవీల (ఎలక్ట్రానిక్ మరియు ఫిజికల్ మోడ్ లలో) కోసం, ఆయా లావాదేవీలను లేదా వాటియొక్క సర్దుబాట్లను లావాదేవీ తేదీ నుండి 90 రోజులు గడిచిన తర్వాత రిజర్వ్ బ్యాంకుకు నివేదింపబడేటట్లైతే, ఏజెన్సీ బ్యాంకులు సంబంధిత మంత్రిత్వశాఖ /డిపార్టుమెంటు నుండి ముందస్తు అనుమతి పొందాలి మరియు ఇటువంటి లావాదేవీల పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంకుకు నివేదిక పంపించేటప్పుడు ఈ అనుమతిని విడిగా దాఖలుచేయాలని నిర్ణయించబడింది.
4. ప్రభుత్వ లావాదేవీల నివేదికత (రిపోర్టింగ్) కాలీనత (టైంలైన్) అనుసరింపుకు సంబంధించి, ఇపుడున్నఉత్తర్వులలో ఎటువంటి మార్పులు లేవని గమనించవలసినది.
మీ విధేయులు
(పార్థా చౌధురి)
జనరల్ మేనేజర్
|