Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (104.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/12/2017
ఏజెన్సీ లావాదేవీల పరిష్కారం కొన్ని సందర్భాల్లో (నిధుల మరియు ఏజెన్సీ కమిషన్ కోసం) రిజర్వ్ బ్యాంకు నుండి నేరుగా

ఆర్.బి.ఐ/2017-18/107
డి.జి.బి.ఏ/జీ.బి.డి.నం/1498/31.02.007/2017-18.

డిసెంబర్ 7, 2017

చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్/ఏజెన్సీ బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

ఏజెన్సీ లావాదేవీల పరిష్కారం కొన్ని సందర్భాల్లో (నిధుల మరియు ఏజెన్సీ కమిషన్ కోసం) రిజర్వ్ బ్యాంకు నుండి నేరుగా

కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడున్న ఏర్పాట్ల ప్రకారం కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఏజెన్సీ బ్యాంకులు వారి సంబంధిత రాష్ట్రాల ఏజెన్సీ లావాదేవీలను ‘యాగ్రగేటర్’ గా పనిచేసే మరో ఏజెన్సీ బ్యాంకుమార్గం ద్వారా మళ్ళిస్తున్నారు. ఆ ‘యాగ్రగేటర్’ బ్యాంకు తమ వంతుగా ఏజెన్సీ లావాదేవీలకు సంబంధించిన వసూళ్లు మరియు చెల్లింపులను వారి సంబంధిత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో పరిష్కరించుకుంటున్నారు. అటువంటి సందర్భాలలో, ‘యాగ్రగేటర్’ గా పనిచేసే ఏజెన్సీ బ్యాంకు మరియు ఇతర ఏజెన్సీ బ్యాంకు రెండూ కలిసి ఆ లావాదేవీలకు సంబంధించిన ఏజెన్సీ కమిషన్ ను భాగించుకుంటున్నారు.

2. అన్ని ఏజెన్సీ బ్యాంకులలో కోర్ బ్యాంకింగ్ / ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ పద్ధతులున్న ఇటువంటికాలంలో, రాష్ట ప్రభుత్వాలకు వేగంగా, సమర్థవంతంగా మరియు సురక్షితంగా బ్యాంకింగ్ సౌకర్యాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ కట్టుబడి ఉంది. ఇందుకోసం ప్రామాణికమైన ఈ-వసూళ్లు మరియు ఈ-చెల్లింపులు అమలుకు తమదైన CBS (ఈ-కుబేర్) తో, రిజర్వ్ బ్యాంకు రాష్ట ప్రభుత్వాల నిధుల (వసూళ్లు మరియు చెల్లింపులు) పరిష్కారం కోసం ఏకైక సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాల నగదు నిర్వహణ మరింతబాగుకై ఇది దోహదపడుతుంది.

3. కాబట్టి, అన్ని ఏజెన్సీ బ్యాంకులు తమ ఏజెన్సీ లావాదేవీలు అంటే నిధులు మరియు ఏజెన్సీ కమిషన్ కోసం, కొన్ని సందర్భాలలో ‘యాగ్రగేటర్’ గా పనిచేసే మరో ఏజెన్సీ బ్యాంకుమార్గం ద్వారా గాకుండా, వారి సంబంధిత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో నేరుగా పరిష్కరించుకోవాల్సిందిగ సమీక్షలో నిర్ణయించబడింది. దీనివల్ల ప్రభుత్వ వసూళ్ల నివేదికను మరో ఏజెన్సీ బ్యాంకు ద్వారా మళ్ళింపకుండా, అన్ని ఏజెన్సీ బ్యాంకులు నేరుగా రిజర్వ్ బ్యాంకుకు నివేదించడం సాధ్యపడుతుంది. అంతేగాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అన్ని ఏజెన్సీ బ్యాంకులు చేసిన చెల్లింపులు సంబంధిత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో నేరుగా పరిష్కారం అవుతాయి. ఏజెన్సీ బ్యాంకులు తమతమ ఏజెన్సీ లావాదేవీల వివరాలు / స్క్రోళ్ళను నేరుగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వo/ ట్రెజరీకి పంపవచ్చు. ఈ ఏర్పాటు వల్ల వ్యవస్థాపరమైన అసమర్థతలు తగ్గడమే గాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నిర్వహణ మెరుగుపడుతుంది.

4 ఇప్పటికే తమ రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను నేరుగా రిజర్వ్ బ్యాంకుతో పరిష్కరించుకోనే ఏజెన్సీ బ్యాంకులు ఈ విధానాన్ని కొనసాగించవచ్చు. ఇప్పటివరకు తమ లావాదేవీలను ‘యాగ్రగేటర్’ గా పనిచేసే మరో ఏజెన్సీ బ్యాంకుమార్గం ద్వారా పరిష్కరించుకొనే ఏజెన్సీ బ్యాంకులు అలాంటి రిపోర్టింగ్ ను నిలిపివేయాలి. అటువంటి బ్యాంకులు ఇకనుంచీ వారి ఏజెన్సీ లావాదేవీలను నేరుగా రిజర్వ్ బ్యాంకుతో పరిష్కరించుకోవాలి. జనవరి 1, 2018 తెదీ నుండి అమలులోకి వస్తున్న ఈ క్రొత్త ఏర్పాటు వల్ల రోజువారీ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ నిధుల పరిష్కారం నేరుగా రిజర్వ్ బ్యాంకుతో పరిష్కరింపబడుతుంది. తద్వారా, అన్ని ఏజెన్సీ కమిషన్ క్లెయిమ్ లు మార్చ్ 31, 2018 తేదీతో అంతమయ్యే త్రైమాసికంతో మొదలిడి, సంబందిత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో నేరుగా పరిష్కరింపబడతాయి.

మీ విధేయులు

(డి.జె. బాబు)
డిప్యూటీ జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….