Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (110.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/08/2017
ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ (Basel III Framework on Liquidity Standards) – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి (Liquidity Coverage Ratio, ఎల్ సి ఆర్) ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షణ సాధనాలు (Liquidity Risk Monitoring Tools) మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలు (LCR Disclosure Standard)

RBI/2017-18/36
DBR.BP.BC.No.81/21.04.098/2017-18

ఆగస్ట్ 02, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు,
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)

అయ్యా/అమ్మా,

ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ (Basel III Framework on Liquidity Standards) – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి (Liquidity Coverage Ratio, ఎల్ సి ఆర్) ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షణ సాధనాలు (Liquidity Risk Monitoring Tools) మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలు (LCR Disclosure Standard)

ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ - ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై జూన్‌ 9, 2014 తేదీన జారీ చేసిన మా సర్క్యులర్ DBOD.BP.BC.No.120/21.04.098/2013-14, మరియు ఈ క్రింది సర్క్యులర్లద్వారా చేసిన సవరణలు దయచేసి చూడండి.

  1. ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ - ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై నవంబర్ 28, 2014 తేదీన జారీ చేసిన మా సర్క్యులర్ DBR.BP.BC.No.52/21.04.098/2014-15.

  2. మూలధన సంపూర్ణత మరియు ద్రవ్యత ప్రమాణాలపై జాగరూకతా మార్గదర్శకాలపై (Prudential Guidelines) మార్చ్ 31, 2015 తేదీన జారీచేసిన సర్క్యులర్ DBR.No.BP.BC.80/21.06.201/2014-15 - సవరణలు.

  3. ద్రవ్యత్వ నష్టభయ నిర్వహణ మరియు ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ - ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై మార్చ్ 23, 2016 తేదీన జారీ చేసిన మా సర్క్యులర్ DBR.BP.BC.No.86/21.04.098/2015-16.

2. ఇతర భాగస్థులనుండి అందిన అభిప్రాయాలు, మా అనుభవం అధారంగా, ఈ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించడంజరిగింది. పై సర్క్యులర్లలో చేసిన సవరణలు, ఈ క్రింది అనుబంధంలో చూపబడ్డాయి.

మీ విశ్వాసపాత్రులు,

ఎస్ ఎస్ బారిక్
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్‌-చార్జ్

అనుబంధాలు: పైన పేర్కొన్నవి


అనుబంధం

ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై జూన్‌ 9, 2014 తేదీన జారీ చేసిన సర్క్యులర్ DBOD.BP.BC.No.120/21.04.098/2013-14 లో సవరణలు.

క్రమ సంఖ్య పేరా ప్రస్తుత నిబంధన సవరించిన నిబంధన
  5.4

5.4 స్థాయి 1 ఎసెట్లు ఈ క్రింది అంశాలు కలిగి ఉంటాయి. ఇవి ఏ పరిమితి లేకుండా, 'హెయిర్‌కట్' అన్వయించకుండా లిక్విడ్ ఎసెట్లలో కలపవచ్చు:

i. అగత్యమైన నగదు నిల్వల నిష్పత్తిని (CRR) మించి ఉన్న ధనంతోసహా, నగదు.

ii. అగత్యమైన కనీస చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని (SLR) మించి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు

iii. విధాయకమైన ఎస్ ఎల్ ఆర్ పరిమితిలో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) క్రింద రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన ప్రభుత్వ సెక్యూరిటీలు

iv. ఈ క్రింది నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ ప్రభుత్వాలు జారీ చేసిన లేక హామీ ఇచ్చిన, అమ్మదగిన సెక్యూరిటీలు (marketable securities)

(a) బాసిల్ II ప్రమాణాల ప్రకారం నష్టభయం 0% గా పరిగణించినవి.

(b) మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నా, రెపో, క్యాష్ మార్కెట్లలో, ద్రవ్యతకు నమ్మకమైన సాధనాలుగా (రెపో లేక సేల్) ట్రేడ్ చేయబడుతూ ఉండవలెను.

(c) బ్యాంకుచే/ఆర్థిక సంస్థలచే/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచేగాని వాటి అనుబంధ సంస్థలచేగాని జారీ చేయబడి ఉండరాదు.

5.4 స్థాయి 1 ఎసెట్లు ఈ క్రింది అంశాలు కలిగి ఉంటాయి. ఇవి ఏ పరిమితి లేకుండా, 'హెయిర్‌కట్' అన్వయించకుండా లిక్విడ్ ఎసెట్లలో కలపవచ్చు:

i. అగత్యమైన నగదు నిల్వల నిష్పత్తిని (CRR) మించి ఉన్న ధనంతోసహా, నగదు.

I (a) భారతదేశంలో వ్యవస్థీకృత (incorporated) బ్యాంకులు.

• ఆవశ్యకమైన నిల్వలను మించి, విదేశీ కేంద్రీయ బ్యాంకులలో ఉంచిన నిల్వలు1. (అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు. విదేశీ ప్రభుత్వానికి (Foreign Sovereign) 0% రిస్క్ వైట్ ఇచ్చినప్పుడు)

• ఆవశ్యకత నిల్వలకు మించి విదేశీ కేంద్రీయ బ్యాంకులలో ఉంచిన నిల్వలు. (అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, విదేశీ ప్రభుత్వాన్ని నాన్‌-0% రిస్క్ వైట్‌గా నిర్ణయించి, జాతీయ విచక్షణ క్రింద, బాసిల్ II ప్రమాణాల అనుసారం 0% రిస్క్ వైట్ నిర్ణయించిన సందర్భాల్లో, ఒత్తిడికి లోనయే నిర్దుష్ట కరెన్సీ నెట్ క్యాష్ ఔట్‌ఫ్లోకు తగినంత పరిమితివరకు).

ii. అగత్యమైన కనీస చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తికి (SLR) మించి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు

iii. విధాయకమైన ఎస్ ఎల్ ఆర్ పరిమితిలో, రిజర్వ్ బ్యాంక్2 అనుమతించిన ప్రభుత్వ సెక్యూరిటీలు. (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ,MSF, క్రింద)

iv. ఈ క్రింది నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ ప్రభుత్వాలు (foreign Sovereigns)3 జారీ చేసిన లేక హామీ ఇచ్చిన, అమ్మదగిన సెక్యూరిటీలు (marketable securities)

(a) బాసిల్ II ప్రమాణాల ప్రకారం నష్టభయం 0% గా పరిగణించినవి.

(b) మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నా, రెపో, క్యాష్ మార్కెట్లలో, ద్రవ్యతకు నమ్మకమైన సాధనాలుగా (రెపో లేక సేల్) ట్రేడ్ చేయబడుతూ ఉండవలెను.

(c) బ్యాంకుచే/ఆర్థిక సంస్థలచే/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచేగాని వాటి అనుబంధ సంస్థలచేగాని జారీ చేయబడి ఉండరాదు.


1 కేంద్రీయ బ్యాంక్ నిల్వలు, బ్యాంకు వారితో ఉంచిన ఓవర్‌నైట్ నిల్వలు, ఈ చెప్పబడిన నిల్వలు కలిపి ఉంటాయి – (i) స్పష్టంగా లేక ఒప్పందానుసారం జమచేసి, బ్యాంకు నోటీసు జారీచేసినంతనే తిరిగి చెల్లించవలసిన డిపాజిట్లు (ii) నియమిత కాలానికిగాని, ఓవర్‌నైట్ గాని (దానికదే నవీకృతమయే విధంగా మరియు ప్రస్తుతం బ్యాంకు, కేంద్రీయ బ్యాంకులో డిపాజిట్ కలిగి ఉన్నప్పుడు) రుణం తీసికొనే సదుపాయం కలిగి ఉండవలెను. ఇతర టెర్మ్‌ డిపాజిట్లు HQLA స్టాక్‌గా పరిగణించడానికి అర్హంకావు. అయితే, 30 రోజులలోపు గడువు ముగిసే డిపాజిట్లు, ఇన్‌ఫ్లోగా పరిగణించవచ్చు.

2 NDTL లో 2% ప్రభుత్వ సెక్యూరిటీలు కలపవచ్చు (అనగా, ప్రస్తుతం, MSFలో అనుమతించబడినవి)

3 రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ బాసిల్ III క్యాపిటల్ రెగ్యులేషన్స్, తేదీ జులై 1, 2013, పేరా 5.3.1. లో సూచించిన, 0% రిస్క్ వైట్ గల మార్కెట్ సెక్యూరిటీలు మాత్రమే కలిగి ఉండాలి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, విదేశీ ప్రభుత్వాన్ని నాన్‌-0% 'రిస్క్ వైట్‌'గా నిర్ణయించి, జాతీయ విచక్షణ క్రింద, బాసిల్ II ప్రమాణాల అనుసారం 0% 'రిస్క్ వైట్' గా నిర్ణయించిన సందర్భాల్లో, విదేశీ ప్రభుత్వం జారీచేసి/ హామీనిచ్చిన (వారి స్వదేశీ పరిధిలో) మార్కెటబుల్ సెక్యూరిటీలు అనుమతించబడతాయి (ఆ సెక్యూరిటీలు, బ్యాంకు నిర్దుష్టమైన విదేశీ ముద్రా లావాదేవీలు జరిపే అధికార పరిధిలో, ఒత్తిడికిలోనయే నెట్ క్యాష్ ఔట్‌ఫ్లోకు తగినంత పరిమితివరకు).

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….