RBI/2013-14/482
DNBS (PD) CC.No.369/03.10.038/2013-14
ఫిబ్రవరి 7, 2014
అన్ని ఎన్ బి ఎఫ్ సిలు/ ఎమ్ ఎఫ్ ఐలు
అయ్యా,
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు-సూక్ష్మ రుణ సంస్థలు (NBFCs-MFIs) నిర్దేశాలు – పరపతి వెలలో సవరణలు
అధికార ప్రకటన DNBS.(PD)No. 234/CGM(US)-2011 తేదీ డిసెంబర్ 02, 2011 "పరపతి వెలకు" సంబంధించి, మరియు ఇతర అంశాలలో మార్పులు చేస్తూ, ఆగస్ట్ 3. 2012 తేదీన జారీచేసిన సర్క్యులర్ DNBS.(PD) CC. No. 300/03.10.38/2012-13 (పేరా 6) దయచేసి చూడండి.
2. ఈ అంశాలు సమీక్షించిన తరువాత, NBFC-MFIలు రుణగ్రహీతలనుండి వసూలుచేసే వడ్డీ రేట్లు, ఈ క్రిందివాటిలో అతి తక్కువదిగా ఉండాలని నిర్ణయించబడింది.
i. నిధుల వెల, అదనంగా DNBS.(PD)CC.No. 300/03.10.38/2012-13 తేదీ ఆగస్ట్ 3, 2012 సర్క్యులర్‌లో [DNBS (PD) CC.No.327/03.10.038/2012-13 తేదీ మే31, 2013 తో కలిపి] సూచించిన మార్జిన్, లేదా
ii. ఐదు అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల సగటు బేస్ రేట్‌ను అసెట్లు X 2. 75 తో భాగించగా వచ్చిన విలువ.
తరువాతి త్రైమాసికంలో వడ్డీ రేట్లు నిర్ణయించడానికి, ఐదు అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల సగటు బేస్ రేట్, ముందు త్రైమాసికపు చివరి రోజున, రిజర్వ్ బ్యాంక్ తెలియచేస్తుంది.
3. పై ఆదేశాలు ఏప్రిల్ 01, 2014 నుండి అమలులోకి వస్తాయి. వర్తించే సగటు బేస్ రేట్, మార్చ్ 31, 2014, ఆపై ప్రతి త్రైమాసికపు చివరి రోజు, రిజర్వ్ బ్యాంక్, తెలియచేస్తుంది.
మీ విశ్వాసపాత్రులు,
(ఎన్ ఎస్ విశ్వనాథన్)
ప్రిన్‌పల్ చీఫ్ జనరల్ మానేజర్ |