ఆర్.బి.ఐ/2017-18/122
ఎఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నం/2195/02.08.001/2017-18.
జనవరి 18, 2018
చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.
డియర్ సర్/మేడమ్,
అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
అస్సాం ప్రభుత్వం, జనవరి 25, 2016, ఫిబ్రవరి 26, 2016 మరియు ఆగష్టు 5, 2016
తేదీలనాడు తమ గెజిట్ నోటిఫికేషన్ ల ద్వారా ఎనిమిది క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది.
క్రమ సంఖ్య |
క్రొత్తగా మలిచిన జిల్లా |
ఇదివరకటి జిల్లా |
క్రొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల పరిధిలోని ఫిర్కాలు (సబ్ డివిజన్లు) |
బాధ్యతలు అప్పగించబడిన లీడ్ బ్యాంకు |
క్రొత్త జిల్లాకు కేటాయించిన ‘డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్’ |
1. |
నగావ్ |
నగావ్ |
కలియాబోర్ |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
014 |
2. |
హోజాయ్ |
నగావ్ |
హోజాయ్ సివిల్ |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
409 |
3. |
శివసాగర్ |
శివసాగర్ |
నజీరా |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
012 |
4. |
చరాయ్ దేవ్ |
శివసాగర్ |
చరాయ్ దేవ్ |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
405 |
5. |
జోర్హాట్ |
జోర్హాట్ |
తితాబోర్ |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
011 |
6. |
మాజులీ |
జోర్హాట్ |
మాజులీ సివిల్ |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
408 |
7. |
ధుబ్ రీ |
ధుబ్ రీ |
బిలాసిపారా |
యూకో బ్యాంక్ |
019 |
8. |
దక్షిణ సాల్ మారా-మాన్ కాచార్ |
ధుబ్ రీ |
ఫకీర్గంజ్ జిల్లా పరిషద్ నియోజక వర్గం, బిరాసింగ్ జార్వా బ్లాకు, మరియు జమాదార్హట్ డెవలప్మెంట్ బ్లాకు తప్ప, మిగతా దక్షిణ సాల్ మారా సబ్ డివిజన్. |
యూకో బ్యాంక్ |
406 |
9. |
సోనిత్పుర్ |
సోనిత్పుర్ |
తేజపూర్, ధేకియాజులీ |
యూకో బ్యాంక్ |
006 |
10. |
బిశ్వనాద్ |
సోనిత్పుర్ |
గహపూర్ సివిల్, బిశ్వనాద్ సివిల్ మరియు చటియా మరియు నోద్వార్ రెవెన్యూ మండలం లోని నాగ్సంకర్ మౌజాలు |
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
407 |
11. |
కార్బీ ఆంగ్ లోంగ్ |
కార్బీ ఆంగ్ లోంగ్ |
బోకాజన్ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
016 |
12. |
పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ |
కార్బీ ఆంగ్ లోంగ్ |
హంరెన్ సివిల్ |
భారతీయ స్టేట్ బ్యాంక్ |
404 |
2. ఫిబ్రవరి 26, 2016 తేదీ గెజెట్ నోటిఫికేషన్ లో “తూర్పు కామరూప్” మరియు “దక్షిణ కామరూప్” పేర్లతో రెండు క్రొత్త జిల్లాలు ప్రకటించినప్పటికీ, అస్సాం ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలు ఇంకా క్రియాశీలం కాలేదు. అందుచేత, ఈ జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యత వేరుగా అప్పగించబడుతుంది.
3. క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకుల BSR నివేదికల కొరకై ఈయబదినవి.
4. అస్సాం రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతలలో ఏ మార్పు లేదు.
మీ విధేయులు
(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్
|