Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (102.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 01/02/2018
చిన్న పొదుపు పథకాలు - ఏజెన్సీ కమిషన్ చెల్లింపు

ఆర్.బి.ఐ/2017-18/127
డి.జీ.బీ.ఏ/జీ.బీ.డి.నం/1972/15.02.005/2017-18.

ఫిబ్రవరి 01, 2018

చిన్న పొదుపు పథకాలను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

చిన్న పొదుపు పథకాలు - ఏజెన్సీ కమిషన్ చెల్లింపు

దయచేసి భారత ప్రభుత్వo వారి అక్టోబర్ 10, 2017 వ తేదీనాటి నోటిఫికేషన్ F నం. 7/10/2014-NS ను గమనించండి. దీనిప్రకారం, ఇపుడున్న చిన్న పొదుపు పథకాలతోపాటు, జాతీయ పొదుపు నిర్ణీత కాల (టైం) డిపాజిట్ పథకం, 1981; జాతీయ పొదుపు (నెలసరి ఆదాయ ఖాతా) పథకం, 1987; జాతీయ పొదుపు రికరింగ్ డిపాజిట్ పథకం, 1981 మరియు జాతీయ పొదుపు సర్టిఫికేట్ల (8వ జారీ) పథకం, 1989 ల క్రింద చెల్లింపులు (సబ్స్క్రిప్షన్లు) స్వీకరించడానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ICICI బ్యాంకు లి., యాక్సిస్ బ్యాంక్ లి. మరియు HDFC బ్యాంక్ లి. అనుమతించబడినవి.

2. పై అనుమతి దృష్ట్యా, ఎదర పేర్కొన్న నాలుగు చిన్న పొదుపు పథకాలను నిర్వహించినందులకు కూడా, అధికృత (ఆధరైస్డ్) బ్యాంకులకు, జూలై 1, 2017 తేదీ నాటి మా మాస్టర్ సర్కులర్ నం. RBI/2017-18/2 DGBA.GBD.2/31.12.010/2017-18 లో సూచించిన రేట్ల ప్రకారం ఏజెన్సీ కమిషన్ ను చెల్లించాలని నిర్ణయించబడింది. పైన పేర్కొన్న పథకాలను సత్వరo అమలుపరచాలని ఏజెన్సీ బ్యాంకులకు సూచించడమైనది.

3. రిపోర్టింగ్, సమన్వయం మరియు అకౌంటింగ్ ఎకరూప్యత కొరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, 1968 కార్యకలాపాల నివేదనల లాగానే, రోజువారీ పద్ధతిలో జమ, చెల్లింపు, పెనాల్టి, వడ్డీ మొదలుగాగల అన్నికార్యకలాపాలను సెంట్రల్ అకౌంట్స్ సెక్షన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, నాగపూర్ వారికి నేరుగా నివేదించాలి.

4. ఏజెన్సీ బ్యాంకులు ఆయా పథకానికి సంబందించిన నియమాలు మరియు నిబంధనలను తప్పక అమలుపరచాలి. నియమాలు మరియు నిబంధనల అమలు ఉల్లంఘనలు జరిమానాకు అర్హమైనవి. ఆటువంటి ఉల్లంఘనలపరంగా ఉత్పన్నమయ్యే ద్రవ్య సంబంధిత భాద్యతలు ఏమైనా ఉంటే, వాటిని బ్యాంకులే పూర్తిగా భరించవలసిఉంటుంది.

5. పైన పేర్కొనబడిన పథకాల క్రింద కార్యకాలాపాలను తక్షణమే నివేదించడానికై అవసరమైన ఏర్పాట్లకొరకు మిమ్ములను, సెంట్రల్ అకౌంట్స్ సెక్షన్, బారతీయ రిజర్వ్ బ్యాంకు, నాగపూర్ వారిని సంప్రదించవలసినదిగా కోరుతున్నాము.

మీ విధేయులు

(పార్ధా చౌధురి)
జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….