Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (156.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/04/2017
బ్యాంకుల కొరకు సవరించిన తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) ఫ్రేంవర్క్

ఆర్.బి.ఐ/2016-17/276
DBS.CO.PPD. BC.No.8/11.01.005/2016-17

ఏప్రిల్ 13, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయించి)

మేడం/డియర్ సర్

బ్యాంకుల కొరకు సవరించిన తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) ఫ్రేంవర్క్

తక్షణ దిద్దుబాటు చర్య పథకం (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) క్రింద దయచేసి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన DBS.CO.PP.BC.9/11.01.005/2002-03 తేదీ డిసెంబర్ 21, 2002 మరియు DBS.CO.PP.BC.13/11.01.005/2003-04 తేదీ జూన్ 15, 2004 నాటి సర్క్యులర్లు చూడండి.

2. బ్యాంకుల కోసం ఉన్న పిసిఎ ఫ్రేంవర్క్ ను సమీక్షించి సవరించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు అనుబంధం లో పొందుపరచబడ్డాయి.

3. సవరించిన పిసిఎ ఫ్రేంవర్క్ యొక్క నిబంధనలు మార్చి 31, 2017 తో ముగిసిన బ్యాంకుల ఆర్థిక సంవత్సరానికి, ఏప్రిల్ 1, 2017 నుంచి అమలులోకి వస్తాయి. మూడు సంవత్సరాల తరువాత ఈ ఫ్రేంవర్క్ ను సమీక్షించడం జరుగుతుంది.

4. నిర్దేశించిన దిద్దుబాటు చర్యలకు అదనంగా, అవసరమైన ఇతర చర్యలను తీసుకోవడానికి పిసిఎ ఫ్రేంవర్క్ భారతీయ రిజర్వు బ్యాంకును నిబంధించదు.

5. ఈ సర్క్యులర్ లోని విషయాలను బ్యాంకు బోర్డు యొక్క డైరెక్టర్ల దృష్టికి తీసుకురావచ్చును.

మీ విశ్వసనీయులు

(పార్వతీ వి. సుందరం)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్


అనుబంధం

బ్యాంకుల కోసం సవరించిన పిసిఎ ఫ్రేంవర్క్ యొక్క ప్రధానాంశాలు

ఎ. మూలధనం, ఆస్తి నాణ్యత మరియు లాభదాయకత, సవరించిన ఫ్రేంవర్క్ లో పర్యవేక్షణ కోసం కీలక అంశాలు కొనసాగుతాయి.

బి. మూలధనం, ఆస్తి నాణ్యత మరియు లాభదాయకత, సిఆర్ఎఆర్/సాధారణ ఈక్విటీ టైర్ I నిష్పత్తి1, నికర ఎన్ పి ఎ నిష్పత్తి2, ఆస్తుల ఫై రిటర్న్ కోసం సూచికలను3 ట్రాక్ చెయ్యడం.

సి. పిసిఎ ఫ్రేంవర్క్ లో భాగంగా లివరేజ్ అదనంగా పర్యవేక్షించబడుతుంది.

డి. ఏదేని ప్రమాద పరిమితుల ఉల్లంఘన (క్రింద వివరించినట్లుగా), పిసిఎ ప్రారంభానికి పిలుపునిస్తుంది.

పిసిఎ మాత్రిక - విషయాలు, సూచికలు మరియు ప్రమాద పరిమితులు
విషయం సూచిక ప్రమాద పరిమితి 1 ప్రమాద పరిమితి 2 ప్రమాద పరిమితి 3
మూలధనం (సిఆర్ఎఆర్/సాధారణ ఈక్విటీ టైర్ I నిష్పత్తి లో ఏదేని ఉల్లంఘన జరిగినప్పుడు, పిసిఎ ట్రిగ్గర్ అవుతుంది) సిఆర్ఎఆర్ – మూలధన కనీస నియంత్రణ పరిమితి నిష్పత్తి మరియు మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి).

ప్రస్తుత కనీస ఆర్బిఐ పరిమితి 10.25% (9% కనీస మొత్తం మూలధనం మరియు మార్చి 31, 2017 నాటికి సిసిబి యొక్క 1.25%)

మరియు/లేదా

కామన్ ఈక్విటీ టైర్ 1 యొక్క ముందు పేర్కొన్న రెగ్యులేటరీ ట్రిగ్గర్ (సిఇటి 1మి) + వర్తించే మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి).

ప్రస్తుత కనీస ఆర్బీఐ పరిమితి 6.75% (మార్చి 31, 2017 నాటికి సిసిబి యొక్క 5.5% ప్లస్ 1.25% *)

పిసిఎ ను ట్రిగ్గర్ చేయడానికి సిఆర్ఎఆర్ లేదా సిఇటి 1 నిష్పత్తి యొక్క ఉల్లంఘన
సూచిక క్రింద 250bps వరకు




<10.25% కానీ >=7.75%

సూచిక క్రింద 162.50bps వరకు సూచిక క్రింద




<6.75% కానీ >= 5.125%

సూచిక కంటే 250bps ఎక్కువ కానీ 400bps మించి కాదు

<7.75% కానీ >=6.25%

సూచిక కంటే 162.50bps ఎక్కువ కానీ 312.50bps మించి కాదు




<5.125% కానీ >=3.625%

-

312.50bps కన్నా ఎక్కువ సూచిక క్రింద

<3.625%
ఆస్తి నాణ్యత నికర నిరర్ధక అడ్వాన్సస్ (ఎన్ ఎన్ పి ఎ) నిష్పత్తి >=6.0% కానీ <9.0% >=9.0% కానీ < 12.0% >=12.0%
లాభదాయకత ఆస్తులపై తిరిగి రాబడి (ఆర్ఓఏ) వరుసగా రెండు సంవత్సరాల్లో ప్రతికూల ఆర్ఓఏ వరుసగా మూడు సంవత్సరాల్లో ప్రతికూల ఆర్ఓఏ వరుసగా నాలుగు సంవత్సరాల్లో ప్రతికూల ఆర్ఓఏ
లివరేజ్ టైర్ 1 లివరేజ్ నిష్పత్తి4 <= 4.0% కాని> = 3.5%
(లివరేజ్ టైర్ 1 మూలధనం కంటే 25 రెట్లు ఎక్కువగా ఉంది)
<3.5% (లివరేజ్ టైర్ 1 మూలధనం 28.6 రెట్లు ఎక్కువగా ఉంది) -
*మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 నాటికి సీసీబీ 1.875% మరియు 2.5% ఉంటుంది.    
  1. బ్యాంక్ ద్వారా సిఇటి1 యొక్క 'ప్రమాద పరిమితి 3' ఉల్లంఘన, సమ్మేళనం, పునర్నిర్మాణం, మూసివేసే వంటి అవకాశం గల అభ్యర్థిగా బ్యాంకు ను గుర్తించడం జరుగుతుంది.

  2. బ్యాంకు యొక్క డిపాజిటర్లకు సమయంలోగా చెల్లించలేనప్పుడు, పిసిఎ మాత్రికకు సంబంధం లేకుండా, సాధ్యమైన పరిష్కార ప్రక్రియలు పునరుద్ధరించబడతాయి.

ఇ. గుర్తించబడిన సూచికల ప్రమాద పరిమితుల ఉల్లంఘన ఆధారంగా, పిసిఎ ఫ్రేంవర్క్, భారతదేశంలో పనిచేస్తున్న అన్ని బ్యాంకులు, చిన్న బ్యాంకులు, శాఖలు లేదా అనుబంధాల ద్వారా పనిచేసే విదేశీ బ్యాంకులతో సహా, మినహాయింపు లేకుండా వర్తిస్తుంది.

ఎఫ్. ఆర్.బి.ఐ ద్వారా ఆడిట్ చేసిన వార్షిక ఆర్ధిక ఫలితాలు మరియు పర్యవేక్షక అంచనాల ఆధారంగా, పిసిఏ ఫ్రేంవర్క్ కింద ఒక బ్యాంకు ఉంచబడుతుంది. ఏదేమైనా, పరిస్థితులు అలా అవసరమైతే, ఆర్.బి.ఐ ఒక సంవత్సర కాలంలో (ఒక ప్రమాద పరిమితి నుండి మరొక ప్రమాద పరిమితికి వెళ్ళేవాటితో సహా) ఏ బ్యాంకులోనైనా పిసిఎను విధించవచ్చు.

తప్పనిసరి మరియు విచక్షణ చర్యలు
లక్షణాలు తప్పనిసరి చర్యలు విచక్షణ చర్యలు
ప్రమాద పరిమితి 1 డివిడెండ్ పంపకం/లాభాల చెల్లింపుపై పరిమితి.
విదేశీ బ్యాంకుల విషయంలో పెట్టుబడిదారులు/యజమానులు/మూల సంస్థ మూలధనం తీసుకురావాలి.
సాధారణ పట్టిక
పరస్పర ప్రత్యేక పర్యవేక్షణలు
వ్యూహానికి సంబంధించినది
పాలన సంబంధిత
మూలధన సంబంధిత
క్రెడిట్ రిస్క్ సంబంధిత
మార్కెట్ రిస్క్ సంబంధిత
హెచ్ ఆర్ సంబంధిత
లాభదాయకత సంబంధిత
కార్యకలాపాల సంబంధిత
ఏదేని ఇతర అంశం
ప్రమాద పరిమితి 2 ప్రమాద పరిమితి 1 యొక్క తప్పనిసరి చర్యలకు అదనంగా,
శాఖ విస్తరణపై నియంత్రణ; దేశీయ మరియు/లేదా విదేశీ
కవరేజ్ పాలనలో భాగంగా ఎక్కువ ముందస్తు ఏర్పాట్లు
ప్రమాద పరిమితి 3 ప్రమాద పరిమితి 1 యొక్క తప్పనిసరి చర్యలకు అదనంగా,
శాఖ విస్తరణపై నియంత్రణ; దేశీయ మరియు /లేదా విదేశీ
నిర్వహణ పరిహారం మరియు డైరెక్టర్స్ ఫీజుపై పరిమితి, వర్తించే విధంగా

సానుకూల పరిష్కార చర్యలను ఎంపిక చేయడానికి సాధారణ పట్టిక

1. ప్రత్యేక పరస్పర పర్యవేక్షక చర్యలు

  • త్రైమాసిక లేదా ఇతర నిర్ధారిత ఆవృత్తాలలో విశేష పర్యవేక్షణ సమావేశాలు

  • బ్యాంకు యొక్క ప్రత్యేక తనిఖీ/లక్ష్యిత పరిశీలన

  • బ్యాంకు యొక్క ప్రత్యేక ఆడిట్

2. వ్యూహాత్మక సంబంధిత చర్యలు

బ్యాంక్ బోర్డుకు ఆర్బిఐ క్రింది విధంగా సలహా ఇస్తుంది:

  • సూపర్వైజర్ ద్వారా ఆమోదించబడిన రికవరీ ప్రణాళిక అమలు

  • వ్యాపార నమూనా యొక్క స్థిరత్వం, వ్యాపార రంగాలు మరియు కార్యకలాపాల లాభదాయకత, మధ్య మరియు దీర్ఘకాలిక సాధ్యత, బ్యాలెన్స్ షీట్ అంచనాలు మొదలైన వాటిపై వ్యాపార నమూనా యొక్క వివరణాత్మక సమీక్ష

  • తక్షణ ఆందోళనలను పరిష్కరించడానికి స్వల్పకాలిక వ్యూహ సమీక్ష

  • మధ్య కాలిక వ్యాపార ప్రణాళికల సమీక్ష, సాధించగల లక్ష్యాలను గుర్తించడం మరియు పురోగతి సాధనకు ఖచ్చితమైన లక్ష్యాలు పెట్టుకోవడం

  • విస్తరణ/సంకోచం కోసం పరిధిని గుర్తించడానికి అన్ని వ్యాపారాలను సమీక్షించడం

  • తగిన విధంగా వ్యాపార ప్రక్రియ పునరుత్పత్తి

  • సముచితమైన కార్యకలాపాల పునర్నిర్మాణాన్ని గుర్తించడం

3. పాలన సంబంధిత చర్యలు

  • తగిన విధంగా పరిగణించబడ్డ వివిధ అంశాలపై బ్యాంకు బోర్డుతో ఆర్బిఐ చురుకుగా పాల్గొనడం

  • క్రొత్త మేనేజ్మెంట్/బోర్డ్ లో తీసుకురావడానికి యజమానులకు (ప్రభుత్వం/ప్రమోటర్లు/విదేశీ బ్యాంకు శాఖ యొక్క మూల సంస్థ), ఆర్బిఐ సిఫారసు చేయాలని

  • బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 యొక్క సెక్షన్ 36AA క్రింద, తగిన విధంగా నిర్వహణాధికారులను ఆర్.ఐ.బి. తొలగించడానికి

  • బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 యొక్క సెక్షన్ 36ACA క్రింద బోర్డును అధిగమించడానికి/అధిగమించడానికి, ఆర్.ఐ.బి., సిఫార్సు చేయడానికి

  • నియంత్రణ విధానాలలో అందుబాటులో ఉన్న క్లా బ్యాక్ మరియు మాలెస్ క్లాజెస్ (claw back and malus clauses) మరియు ఇతర చర్యలకు పిలుపునివ్వడం, మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 క్రింద అనుమతించిన ఇతర పరిమితులు లేదా షరతులను ఆర్.ఐ.బి. విధించడం

  • డైరెక్టర్లు లేదా మానేజ్మెంట్ల జీతభత్యాల ఫై, వర్తించే విధంగా ఆంక్షలు విధించడం

4. మూలధన సంబంధిత చర్యలు

  • మూలధన సంబంధిత ప్రణాళిక ఫై, బోర్డు స్థాయి వివరణాత్మక సమీక్ష

  • అదనపు మూలధనాన్ని పెంచడానికి ప్రణాళికలు మరియు ప్రతిపాదనలను సమర్పించడం

  • లాభాల ద్వారా నిల్వలను పెంచడానికి బ్యాంకు వ్యూహం

  • అనుబంధ సంస్థలు/అసోసియేట్స్ లో పెట్టుబడులపై నియంత్రణ

  • మూలధనం కాపాడటానికి అధిక రిస్క్-వెయిట్ ఆస్తుల విస్తరణలో పరిమితి

  • మూలధనం కాపాడటానికి అధిక హాని రంగాల బహిర్గతం తగ్గింపు

  • అనుబంధ మరియు ఇతర సమూహ సంస్థలలో వాటాను పెంచటం పై పరిమితులు

5. క్రెడిట్ రిస్క్ సంబంధిత చర్యలు

  • సమయ పరిధి ప్రణాళిక తయారీ మరియు నిరర్ధక ఆస్తుల (NPA) యొక్క స్టాక్ తగ్గింపు కోసం నిబద్ధత

  • తాజా నిరర్ధక ఆస్తుల తగ్గింపుకు ప్రణాళిక మరియు నిబద్ధత

  • రుణ సమీక్ష విధానం యొక్క బలోపేతం

  • కొన్ని రేటింగ్ తరగతులు క్రింద రుణగ్రహీతలు కోసం క్రెడిట్ విస్తరణలో/తగ్గింపు పరిమితులు

  • రిస్క్ ఆస్తులలో తగ్గింపు

  • రుణ గ్రహీతలకు క్రెడిట్ విస్తరణలో పరిమితులు/తగ్గింపులు

  • అసురక్షిత ఎక్స్పోజర్లలో తగ్గింపు

  • ఋణ సాంద్రతలలో తగ్గింపు; గుర్తించబడిన రంగాలలో, పరిశ్రమలు లేదా రుణగ్రహీతలు

  • ఆస్తుల అమ్మకం

  • గుర్తించిన అంశాలపై (భౌగోళిక జ్ఞానం వారీగా, విభాగాల వారీగా, పరిశ్రమ వారీగా, రుణగ్రహీత వారీగా మొదలైనవి) ఆస్తుల రికవరీ కోసం ప్రణాళిక మరియు అంకితమైన రికవరీ టాస్క్ ఫోర్సెస్, అదాలత్స్, మొదలైన వాటి ఏర్పాటు

6. మార్కెట్ రిస్క్ సంబంధిత చర్యలు

  • ఇంటర్ బ్యాంకు మార్కెట్ నుండి రుణాలపై పరిమితులు/తగ్గింపులు

  • టోకు డిపాజిట్లు/ఖరీదైన డిపాజిట్లు/సర్టిఫికెట్ అఫ్ డిపాజిట్లు లభ్యం చేసుకోవడం/పునరుద్ధరించే పరిమితులు

  • డెరివేటివ్ కార్యక్రమాలపై పరిమితులు, అనుషంగిక (కొల్లేటరల్) ప్రత్యామ్నాయాన్ని అనుమతించే డెరివేటివ్స్

  • కాంట్రాక్టును ఏ సమయంలోనైనా కౌంటర్ పార్టీ తీసుకునే విధంగా, కొల్లేటరల్ యొక్క అదనపు నిర్వహణపై పరిమితి

7. హెచ్ ఆర్ సంబంధిత చర్యలు

  • సిబ్బంది విస్తరణపై నియంత్రణ

  • ఉన్న సిబ్బంది యొక్క ప్రత్యేక శిక్షణ అవసరాల సమీక్ష

8. లాభాల సంబంధిత చర్యలు

  • బోర్డ్ ఆమోద పరిమితులతో, సాంకేతిక అభివృద్ధి కోసం మినహా, మూలధన వ్యయంపై పరిమితులు

9. ఆపరేషన్స్ సంబంధిత చర్యలు

  • శాఖ విస్తరణ ప్రణాళికలపై పరిమితులు; దేశీయ లేదా విదేశీ

  • విదేశీ శాఖలలో/అనుబంధ సంస్థలలో/ఇతర సంస్థలలో వ్యాపారంలో తగ్గింపు

  • కొత్త వ్యాపార మార్గాలలో ప్రవేశించడానికి పరిమితులు

  • నిధుల ఆధారిత వ్యాపారంలో తగ్గింపు ద్వారా పరపతి తగ్గింపు

  • ప్రమాదకర ఆస్తుల తగ్గింపు

  • నాన్-క్రెడిట్ ఆస్తి సృష్టిపై పరిమితులు

  • పేర్కొన్న విధంగా, వ్యాపార నిర్వహణలో పరిమితులు

బ్యాంకు యొక్క నిర్దిష్టమైన పరిస్థితులను పరిగణనలో ఉంచుకొని, ఆర్బిఐ తీసుకొనే ఏదైనా ఇతర చర్య


1 CET 1 నిష్పత్తి - ఆర్బిఐ బాసెల్ III మార్గదర్శకాలలో వివరించిన విధంగా కోర్ ఈక్విటీ క్యాపిటల్, రెగ్యులేటరీ సర్దుబాటుల మొత్తం, మొత్తం రిస్క్ వెయిటెడ్ ఆస్తులకు

2 NNPA నిష్పత్తి - నికర అడ్వాన్స్లకు నెట్ NPA ల శాతం

3 ROA - సగటు మొత్తం ఆస్తులు పన్ను తర్వాత లాభం శాతం

4 టైర్ 1 పరపతి నిష్పత్తి - పరపతి నిష్పత్తిలో ఆర్బిఐ మార్గదర్శకాలలో నిర్వచించిన ఎక్స్పోజర్ కొలతకు మూలధన కొలత శాతం.

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….