ఉప నిర్వాహకులు
(Deputy Governor)
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆంబుడ్జ్‌మన్ పథకం – 2018
అధికార ప్రకటన
CEPD. PRS. No. 3590/13.01.004/2017-18
ఫిబ్రవరి 23, 2018
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో (ఎన్ బి ఎఫ్ సి) అనుకూలమైన పరపతి సంస్కృతి నెలకొల్పుటకు, పరపతి వ్యవస్థ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నియంత్రించుటకొరకు, ఒక ఆంబుడ్జ్‌మన్ పథకం ఆవశ్యకమని రిజర్వ్ బ్యాంక్ భావించినది. తదనుసారంగా, డిపాజిట్లు, రుణాలు / అప్పులు తదితర నిర్దిష్టమైన సేవలలో సంభవించిన లోపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి, ఒక ఆంబుడ్జ్‌మన్ వ్యవస్థ అవసరమని నిశ్చయించినది. అందువల్ల, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45L ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్ 45-I(f) లో నిర్వచించబడిన మరియు సెక్షన్ 45 IA ప్రకారం రిజర్వ్ బ్యాంకులో నమోదయిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు [(a) డిపాజిట్లు స్వీకరించుటకు అనుమతించబడిన లేక (b) ఖాతాదారులు కలిగి, బ్యాలెన్స్ షీట్ ఆడిట్ చేయబడిన క్రిందటి తేదీనాడు, ఒక బిలియన్ రూపాయిలు లేదా అంతకుమించి అసెట్లుగల (లేదా ఆర్ బి ఐ నిర్దేశించిన విలువకు మించి)] ఆంబుడ్జ్‌మన్ పరిధిలోకి వస్తాయనీ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆంబుడ్జ్‌మన్ పథకంయొక్క నిబంధనలు పాటించాలనీ/ ఇందుమూలముగా రిజర్వ్ బ్యాంక్ ఆదేశిస్తున్నది.
2. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక సంస్థలు (NBFC-IFC), మౌలిక పెట్టుబడి కంనీలు (CIC), మౌలిక రుణనిధి - బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (IDF-NBFC) మరియు దివాలాలోనున్న ఎన్ బి ఎఫ్ సి లు, ఈ పథకం పరిధినుండి మినహాయించబడ్డాయి.
3. ప్రారంభంలో, ఈ పథకం, డిపాజిట్లు స్వీకరిస్తున్న ఎన్ బి ఎఫ్ సి లకు వర్తింపజేయబడుతుంది. ఈ అనుభవం ఆధారంగా, గుర్తించిన ఇతర వర్గాల బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు విస్తరించబడుతుంది. దేశవ్యాప్తంగా ఆయా మండలాల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి, ప్రథమంగా, చెన్నై, కోల్కతా, ముంబై మరియు న్యూ ఢిల్లీ మహానగరాలలో ఈపథకం ప్రారంభించబడుతోంది. ఈకార్యాలయాల అధికార పరిధి, అనుబంధం ‘I’ లో సూచించబడినది.
4. ఈపథకం, ఫిబ్రవరి 23, 2018 నుండి అమలులోకి వస్తుంది.
బి పి కనుంగో |