ఆర్బిఐ/2017-18/136
DCM (CC) No.3071/03.41.01/2017-18
మార్చి 01, 2018
అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకులు/
ముఖ్య కార్యనిర్వాణ అధికారి
అన్ని బ్యాంకులు
మేడం / డియర్ సర్,
కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES)
దయచేసి ఫిబ్రవరి 7, 2018 నాటి రెండు-నెలల వారీ ద్రవ్య విధాన సమీక్ష యొక్క పార్ట్ B లో చేసిన ప్రకటనను చూడండి. ఎప్పటికప్పుడు వివిధ యంత్రాల సంస్థాపనకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి మెరుగైన వినియోగదారు సేవ కోసం వారి కరెన్సీ కార్యకలాలకు, బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పథకం యొక్క లక్ష్యాలు ఎక్కువగా సాధించాయని గమనించబడింది.
2. సమీక్షణాంతరం, క్యాష్ రీసైక్లర్లు మరియు తక్కువ విలువ గల నోట్లను ఇచ్చే ఎటిఎం (ATM) ల సంస్థాపన కోసం బ్యాంకులకు జూలై 20, 2016 నాటి మాస్టర్ డైరెక్షన్ DCM (CC) No.G-4/03.41.01/2016-17 ద్వారా ఇచ్చిన ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడమైనది.
3. పై సూచనలు వెంటనే అమలులోకి వస్తాయి. పై మాస్టర్ డైరెక్షన్లో సూచించిన పరిమితులకు సంబంధించి, ముందు మరియు సర్కులర్ తేదీతో సహా బ్యాంకులకు పంపిణీ చేయబడిన యంత్రాలకు సంబంధించి వాదనలు పైన ఉదహరించిన జూలై 20, 2016 తేదీ నాటి మాస్టర్ డైరెక్షన్ పరిమితులకు లోబడి, మా ప్రాంతీయ కార్యాలయాల ద్వారా పరిష్కరించబడతాయి.
4. సర్కులర్ మా వెబ్ సైట్ www.rbi.org.in. లో లభిస్తుంది.
మీ విధేయులు,
(అజయ్ మిచ్యారి)
చీఫ్ జనరల్ మేనేజర్ |