Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (319.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 23/04/2015
ప్రాధాన్యతా రంగాలకు ఋణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ

ఆర్.బి.ఐ/2014-15/573
యఫ్.ఐ.డి.డి./సీ.ఓ.ప్లాన్.బీసీ.54/04.09.01/2014-15

ఏప్రిల్ 23, 2015

చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ
అన్ని షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు,
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయించి)

డియర్ సర్ / మేడమ్,

ప్రాధాన్యతా రంగాలకు ఋణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ

ప్రాధాన్యతా రంగాలకు ఋణాలకై ప్రస్తుతo ఉన్నటువంటి మార్గదర్శకాల పునఃపరిశీలనార్ధం జులై 2014 వ సంవత్సరంలో ఒక అంతర్గత వర్కింగ్ గ్రూప్ (IWG) ఏర్పాటు చేయబడింది. సలహాల కొరకై వర్కింగ్ గ్రూప్ (IWG) నివేదికను పబ్లిక్ డొమైన్ నందు ఉంచబడింది. ఇందుమూలంగా భారత ప్రభుత్వం, బ్యాంకులు మరియు తదితర స్టేక్-హోల్డర్స్ నుంచి వచ్చిన సూచనలను మరియు సలహాలను పరిగణనలోకి తీసుకుని వర్కింగ్ గ్రూప్ (IWG) సిఫారసులు పరిశీలింప బడినాయి. మరియు ప్రాధాన్యతా రంగాలకు ఋణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ గురించి 2014 సంవత్సరం జులై ఒకటవ తేదీ మాస్టర్ సర్కులర్ ఆర్.పీ.సీ.డి. సీ.ఓ.ప్లాన్.బీసీ.10/04.09.01/2014-15 లో పేర్కొన్న మార్గదర్శకాల స్థానం లో సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు.

2. ఈ మార్గదర్శకాల ముఖ్యాంశాలు ఈ క్రింద పేర్కొనబడినాయి:-

(అ) ప్రాధాన్యతా రంగo లోని వర్గాలు (క్యాటగరీలు): ఇపుడున్న వర్గాలకు అదనంగా, మధ్యస్థమైన (మీడియం) సంస్థలు, సాంఘిక (సోషల్) మౌళిక సదుపాయాల కల్పన మరియు పునరుద్ధరణీయ శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) ప్రాధాన్యతా రంగoలో భాగం అవుతాయి.

(ఆ) వ్యవసాయo: ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యవసాయo మధ్యయున్నవ్యత్యాసము తొలగించబడినది.

(ఇ) చిన్న మరియు సన్నకారు రైతాంగం: వ్యవసాయరంగం లో, చిన్న మరియు సన్నకారు రైతాంగం నకు ఋణాల లక్ష్యం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 8 (ఎనిమిది) శాతం ఏదైతే ఎక్కువవో దానిని, దశలలో అంటే మార్చి 2016 సంవత్సరం నాటికి 7 శాతంగా మరియు మార్చి 2017 సంవత్సరం నాటికి 8 శాతంగా చేరుకోవాలని నిర్దేశించబడినది.

(ఈ) సూక్ష్మ సంస్థలు (మైక్రో ఎంటర్ప్రైజెస్) : సూక్ష్మ సంస్థల (మైక్రో ఎంటర్ప్రైజెస్) కు ఋణాల లక్ష్యం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 7.5 (ఏడున్నర) శాతం ఏదైతే ఎక్కువవో దానిని, దశలలో అంటే మార్చి 2016 సంవత్సరం నాటికి 7 శాతంగా మరియు మార్చి 2017 సంవత్సరం నాటికి 7.5 శాతంగా చేరుకోవాలని నిర్దేశించబడినది.

(ఉ) బలహీన వర్గాలకు ఋణాల లక్ష్యం, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 10 (పది) శాతం ఏదైతే ఎక్కువవో అది, లో ఎటువంటి మార్పు లేదు.

(ఊ) విదేశీ బ్యాంకులకు లక్ష్యం: ప్రాధాన్యతా రంగాల ఋణాల లక్ష్యాలు మరియు వ్యవసాయం మరియు బలహీన వర్గాలకు ఉప లక్ష్యాలను (సబ్-టార్గెట్ లను) ఇప్పటికే కలిగియున్న ఇరవై గాని అంతకు మించి గాని బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులు, ఆయా లక్ష్యాలను మార్చి 31, 2018 వ తేదీ నాటికి చేరుకోవడానికై, వారిచే సమర్పించబడిన కార్య ప్రణాలికలు రిజర్వ్ బ్యాంకు వారిచే ఆమోదం పొందబడాలి. చిన్న మరియు సన్నకారు రైతులు మఱియు సూక్ష్మ సంస్థలకు నిర్దేశించబడిన ఋణాల ఉప లక్ష్యాలు (సబ్-టార్గెట్స్) 2017 వ సంవత్సరoలో సమీక్ష తర్వాత, 2018 పర్యంతం నుండి వర్తిస్తాయని నిర్దేశిoచబడింది. ఇరవై కన్నా తక్కువగా బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులకు ప్రాధాన్యతా రంగాలకు ఋణాల మొత్తం లక్ష్యం, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 40 (నలభై) శాతంగా ఏదైతే ఎక్కువవో అది, 2019-2020 సంవత్సరం నాటికి ఇతర బ్యాంకులతో సమానంగా చేరబోతోంది. మరియు ఈ బ్యాంకులకు ఉప లక్ష్యాలు (సబ్-టార్గెట్ లు), ఒకవేళ 2020 పర్యంతం నుండి వర్తింపజేస్తే, తగిన సమయంలో నిశ్చయించబడతాయి.

(ఎ) ఆహార మరియు వ్యవసాయ-శుద్ధి యూనిట్లకు ఇచ్చే బ్యాంకు ఋణాలు వ్యవసాయం లో భాగం అవుతాయి.

(ఏ) ఎగుమతి రంగానికి ఋణాలు: ఇరవై కన్నా తక్కువగా బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులు ఎగుమతి రంగానికి ఇచ్చేటువంటి ఋణాలు, వారి వారి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 32 (ముప్పై రెండు) శాతం వరకు ఏదైతే ఎక్కువవో అది, ప్రాధాన్యతా రంగం లో భాగంగా అర్హమౌతాయి. ఇతర బ్యాంకులకైతే, ఎగుమతి రంగం లో గత సంవత్సరం సంబందిత పర్తింపు తేదీ పైబడిఉన్న ఋణాల వృద్ధి, వారి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE)లో 2 (రెండు) శాతం వరకు, ఏదైతే ఎక్కువవో దానిని, ప్రాధాన్యతా రంగం పరిగణనలోనికి తీసుకోబడుతుంది.

(ఐ) ప్రాధాన్యతా రంగం క్రింద అర్హత కొఱకు హౌసింగ్ ఋణాల మరియు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఋణాల పరిమితులు సవరించ బడినాయి.

(ఒ) ప్రాధాన్యతా రంగం నకు ఋణాల సాధ్యాసాధ్యాలను, ఇపుడున్న వార్షిక ప్రాతిపదికకు బదులు, త్రైమాసిక సగటు ఆధారంగా 2016-17 నుండి సంబంధిత సంవత్సరం చివరలో అంచనా వేయబడతాయి.

సవరించిన మార్గదర్శకాలు ఈ సర్కులర్ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ తేదీకి పూర్వం జారీచేసిన మార్గదర్శకాలక్రింద మంజూరైన ప్రాధాన్యతా రంగం ఋణాలు వాటి వాటి తిరిగి చెల్లింపు/ గడువు/ రెన్యూవల్ వరకు ప్రాధాన్యతా రంగo క్రిందనే వర్గీకరించబడుతాయి.

మీ విధేయులు

(ఏ. ఉద్గాట)
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….