ఆర్బిఐ/2017-18/105
DPSS.CO.PD సంఖ్య. 1633/02.14.003/2017-18
డిసెంబరు 06, 2017
అధ్యక్షుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో కలిపి
పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు
పేమెంట్ బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు/అన్ని కార్డు నెట్ వర్క్ ప్రొవైడర్లు
ప్రియమైన సర్/మేడం,
డెబిట్ కార్డు లావాదేవీలకు వ్యాపారి తగ్గింపు ధర (మర్చంట్ డిస్కౌంట్ రేట్ - ఎండిఆర్) యొక్క హేతుబద్ధీకరణ
భారతీయ రిజర్వు బ్యాంకు ఐదవ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన 2017-18 లో డెబిట్ కార్డు లావాదేవీల సవరించిన వ్యాపారి తగ్గింపు ధర (ఎండిఆర్) ఫ్రేమ్వర్క్ గురించి, దయచేసి అభివృద్ధి మరియు నియంత్రణ విధానాల ప్రకటన లోని పేరా 1 చూడండి.
2. డెబిట్ కార్డు లావాదేవీలకు వర్తించే గరిష్ట ఎండిఆర్, జూన్ 28, 2012 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు సర్కులర్ DPSS.CO.PD.No.2361/02.14.003/2011-12లో పేర్కొంది. దీనిని డిసెంబర్ 16, 2016 తేదీ సర్కులర్ DPSS.CO. PD.No.1515/02.14.003/2016-17తో సవరించారు.
3. "డ్రాఫ్ట్ సర్క్యులర్ - డెబిట్ కార్డు లావాదేవీల కోసం వ్యాపారి తగ్గింపు ధర (ఎండిఆర్) యొక్క హేతుబద్ధీకరణ" లో వాటాదారుల సంప్రదింపుల ఆధారంగా ముఖ్యంగా విస్తారమైన వ్యాపారులు, ప్రత్యేకించి చిన్న వ్యాపారులచే, మరియు పాల్గొన్న సంస్థలకు వ్యాపారం యొక్క స్థిరత్వంను, భరోసాను ఇచ్చి డెబిట్ కార్డు ఆమోదాన్ని ప్రోత్సహించే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని, క్రింది ప్రమాణాల ఆధారంగా డెబిట్ కార్డుల కోసం ఎండిఆర్ ను హేతుబద్ధీకరించడానికి నిర్ణయించబడింది:
ఎ. టర్నోవర్ ఆధారంగా వర్తకుల వర్గీకరణ.
బి. QR- సంకేత ఆధారిత లావాదేవీలకు వేరు వేరు ఎండిఆర్ ను ప్రవేశపెట్టడం.
సి. 'కార్డు ప్రస్తుతము' మరియు 'కార్డు ఇవ్వని' లావాదేవీల కోసం గరిష్టంగా అనుమతించబడిన ఎండిఆర్ యొక్క పరిమితిని పేర్కొనడం.
4. దీని ప్రకారం, డెబిట్ కార్డు లావాదేవీలకు గరిష్ట ఎండిఆర్ క్రింది విధంగా ఉండాలి:
క్రమ సంఖ్య |
వ్యాపార వర్గం |
డెబిట్ కార్డు లావాదేవీల కోసం వ్యాపారి తగ్గింపు ధర
(ఎండిఆర్) (లావాదేవీ విలువ యొక్క%) |
ఆన్లైన్ కార్డు లావాదేవీలతో కూడిన భౌతిక POS మౌలిక సదుపాయాలు |
QR కోడ్ ఆధారిత కార్డు అంగీకార మౌలిక సదుపాయాలు |
1 |
చిన్న వ్యాపారులు
(గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.20 లక్షలు వరకు) |
0.40% మించి కాదు
(లావాదేవీకి రూ. 200 ఎండిఆర్ పరిమితి) |
0.30% మించి కాదు
(లావాదేవీకి రూ. 200 ఎండిఆర్ పరిమితి) |
2 |
ఇతర వ్యాపారులు
(గత ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షలకు పైన టర్నోవర్) |
0.90% మించి కాదు
(లావాదేవీకి రూ. 1000 ఎండిఆర్ పరిమితి) |
0.80% మించి కాదు
(లావాదేవీకి రూ. 1000 ఎండిఆర్ పరిమితి) |
5. ఎండిఆర్ ను స్వేచ్చపర్చడం ఫై సెప్టెంబర్ 1, 2016 తేదీ భారతీయ రిజర్వు బ్యాంకు సర్కులర్ DPSS.CO.PD.సంఖ్య 639/02.14.003/2016-17 మరియు వ్యాపారి సముపార్జన కోసం బోర్డు ఆమోదం పొందిన విధానాన్ని ఉంచడం ఫై మే 26, 2016 నాటి సర్కులర్ DPSS.CO.PD. సంఖ్య 2894/02.14.003/2015-2016 చూడండి. బ్యాంకులు మరియు అధీకృత కార్డు చెల్లింపు నెట్వర్క్స్, ఈ ఆదేశాలకు కట్టుబడి వుండాలని ఫై సర్కులర్ల ద్వారా పునరుద్ఘాటించబడింది. అంతేకాకుండా, వ్యాపారిపై కార్డు అంగీకార మౌలిక సదుపాయాలను అమలు చేస్తున్న ఎండిఆర్ తో సంబంధం లేకుండా, వ్యాపారిపై రుణ రేట్లను పరిమితులకు మించకుండా బ్యాంకులు చూసుకోవాలి.
6. డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను ఆమోదించినప్పుడు వినియోగదారులకి ఎండిఆర్ రుసుములు పడకుండా చూడాలని కూడా బ్యాంకులకు సలహా ఇవ్వడమైనది.
7. పై సూచనలు జనవరి 1, 2018 నుండి అమలులో ఉంటాయి. ఈ సూచనలను సమీక్షకు లోబడి ఉంటాయి.
8. ఈ నిర్దేశం సెక్షన్ 18 తో కలిపి, సెక్షన్ 10 (2), చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007, (చట్టం 51, 2007) క్రింద జారీ చేయబడింది.
మీ విధేయులు
(నందా ఎస్. దవే)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్ |