ఆర్బిఐ/2017-18/186
DBR.No.BP.BC.108/21.04.048/2017-18
జూన్ 6, 2018
అన్ని బ్యాంకులు మరియు
భారతీయ రిజర్వు బ్యాంకు చే నియంత్రించబడే ఎన్ బి ఎఫ్ సి లు
మేడమ్ / డియర్ సర్,
ఎంఎస్ఎంఇ (MSME) రంగం యొక్క అధికారికీకరణ ను ప్రోత్సహించడం
దయచేసి ఫిబ్రవరి 07, 2018 నాటి సర్కులర్ DBR.No.BP.BC.100/21.04.048/2017-18 ను చూడండి.
2. ఇన్ ఫుట్ క్రెడిట్ లింకేజెస్ మరియు సహాయక అనుబంధాలను దృష్టి లో ఉంచుకొని, బ్యాంకులు మరియు ఎన్.బి.ఎఫ్.సిలు, ఎంఎస్ఎంఇలకు వస్తు సేవా పన్ను (GST) క్రింద నమోదు చేయని వాటితో కూడా కలిపి, 180 రోజుల గడువు ప్రకారం, వారి ఎక్స్పోజర్స్ ను ఒక 'ప్రామాణిక' ఆస్తిగా క్రింది పరిస్థితులకు లోబడి, వర్గీకరించడానికి తాత్కాలికంగా అనుమతించబడ్డాయి:
i. రుణగ్రహీతలకు, బ్యాంకుల మరియు ఎన్.బి.ఎఫ్.సిల మొత్తం ఎక్స్పోజర్, ఫండ్ ఆధారిత కాని వాటితో కలిపి మే 31, 2018 నాటికి, రూ.250 మిలియన్లకు మించకూడదు.
ii. రుణగ్రహీత యొక్క ఖాతా ఆగష్టు 31, 2017 నాటికి ‘ప్రామాణికం’ గా ఉండి ఉండాలి.
iii. రుణగ్రహీతల సెప్టెంబరు 1, 2017 నాటికి చెల్లింపులు మరియు తరువాత డిసెంబరు 31, 2018 నాటికి చెల్లించాల్సిన చెల్లింపులు, వాటి అసలు తేదీ నుండి 180 రోజుల లోపు చెల్లించబడాలి.
iv. GST- నమోదైన ఎంఎస్ఎంఇ ల ద్వారా జనవరి 1, 2019 నుండి చెల్లించాల్సిన బకాయిల విషయంలో, 180 రోజుల పూర్వ ప్రమాణంగా ఉన్న గడువు, అనుబంధంలో ఇవ్వబడిన IRAC నిబంధనలకు అనుగుణంగా, దశలవారీగా సమలేఖనం చేయబడుతుంది. అయితే, డిసెంబర్ 31, 2018 నాటికి GSTక్రింద నమోదు చేయని ఎంఎస్ఎంఇ ల కోసం, జనవరి 1, 2019 నుండి చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఆస్తుల వర్గీకరణను, వెంటనే IRAC నిబంధనలకు పునరుద్ధరించాలి.
v. ఫిబ్రవరి 07, 2018 నాటి సర్కులర్ లోని ఇతర నియమ, నిబంధనలలో ఎటువంటి మార్పు ఉండదు.
మీ విధేయులు,
(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్
అనుబంధం
ఏ చెల్లింపు అయినా తిరిగి చెల్లించవలసిన కాల అవధి |
అనుమతించబడిన కాలం |
సెప్టెంబర్ 1, 2017 - డిసెంబర్ 31, 2018 |
180 రోజులు |
జనవరి 1, 2019 - ఫిబ్రవరి 28, 2019 |
150 రోజులు |
మార్చి 1, 2019- ఏప్రిల్ 30, 2019 |
120 రోజులు |
మే 1, 2019 నుండి |
90 రోజులు |
|