ఆర్బిఐ/2017-2018/191
DBR.DEA ఫండ్ సెల్. BCNo.110/30.01.002/2017-18
జూన్ 07, 2018
కార్యనిర్వాహక సంచాలకుడు & ముఖ్య కార్యనిర్వహణ అధికారి/
ముఖ్య కార్యనిర్వహణ అధికారులు
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో కలిపి)
స్థానిక ప్రాంత బ్యాంకులు (LABs)/
పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు/పేమెంట్ బ్యాంకులు
డియర్ సర్ / మాడమ్,
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 - సెక్షన్ 26A డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ (DEAF) పథకం, 2014 - కార్యాచరణ మార్గదర్శకాలు - వడ్డీ చెల్లింపు
దయచేసి జూన్ 26, 2014 తేదీ సర్కులర్ DBOD. సంఖ్య DEA ఫండ్ సెల్.బిసి.126 / 30.01.002/2013-14 ను చూడండి. భారతీయ రిజర్వు బ్యాంకు దీని ద్వారా డిపాజిటర్లకు/డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ కు బదిలీ చేయబడే డిపాజిట్ క్లెయిమ్ చేయని దావాదారులకు, బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు తదుపరి సూచన వరకు, సంవత్సరానికి 4% సాధారణ వడ్డీ గా ప్రకటించింది.
2. సమీక్షణానంతరం, డిపాజిటర్లకు/డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ కు బదిలీ చేయబడే డిపాజిట్ క్లెయిమ్ చేయని దావాదారులకు, బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు సంవత్సరానికి 3.5% సాధారణ వడ్డీ గా, జూలై 01, 2018 నుండి ఉంటుంది. జూలై 01, 2018 నుండి లేదా తర్వాత బ్యాంకులు అందుకున్న అన్ని క్లైముల పరిష్కారం, తదుపరి సూచన వరకు, ఈ వడ్డీ రేటు తో ఉంటుంది.
3. జూన్ 26, 2014 నాటి సర్కులర్ లోని ఇతర నియమ నిబంధనలలో ఎటువంటి మార్పు లేదు.
మీ విధేయులు,
(ప్రకాష్ బలియార్ సింగ్)
చీఫ్ జనరల్ మేనేజర్ |