RBI/2018-19/15
FIDD.CO.Plan.BC.07/04.09.01/2018-19
తేదీ: జులై 12, 2018
ది చైర్‌మన్/మానేజింగ్ డైరెక్టర్,
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్,
అన్ని దేశీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా)
అయ్యా,
ప్రాధాన్య రంగ రుణాలు -లక్ష్యా్లు మరియు వర్గీకరణ: నాన్-కార్పొరేట్ వ్యవసాయదారులకు రుణాలు – గత మూడు ఏళ్ళ వ్యవస్థాగత సగటు
గత మూడు ఏళ్ళుగా, నాన్-కార్పొరేట్ వ్యవసాయదారులకు ప్రత్యక్ష రుణాలు అందించుటలో సాధించిన వ్యవస్థాగత సగటు విలువ, తరువాత తెలియచేయబడుతుందని, ఆ తరువాత ప్రతి సంవత్సరం ఆరంభంలో తెలియచేయబడుతుందని ప్రకటిస్తూ జారీచేసిన మా సర్క్యులర్ No.FIDD.CO. Plan.BC.08/04.09.01/2015-16 తేదీ జులై 16, 2015, దయచేసి చూడండి.
2. ఈ సందర్భంగా, ప్రాధాన్య రంగ రుణాల లక్ష్య సాధన లెక్కించుటకు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి వర్తించే వ్యవస్థాగత సగటు 11.99 శాతమని, తెలియచేస్తున్నాము.
మీ విశ్వాసపాత్రులు,
(గౌతమ్ ప్రసాద్ బోరా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్ |