ఆర్ బి ఐ/2018-19/88
డిజిబిఎ.జిబిడి.సంఖ్య.1397/15.01.001/2018-19
డిసెంబర్ 6, 2018
అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి
ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్‌డిఎస్) -1975 నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు
ప్రియమైన సర్,
ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్‌డిఎస్) -1975 2018 క్యాలెండర్ సంవత్సరానికి వడ్డీ చెల్లింపు
ఎస్‌డిఎస్ 1975 వడ్డీ రేట్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు భారత ప్రభుత్వ వెబ్‌సైట్ egazette.nic.in లో అందుబాటులో ఉన్నాయని మరియు మార్గదర్శకత్వం కోసం వాటిని పరిశీలంచవచ్చని తెలియజేస్తున్నాము. ఎస్‌డిఎస్ 1975 కోసం, 2018 క్యాలెండర్ సంవత్సరానికి వడ్డీని గెజిట్‌లో పేర్కొన్న రేట్ల ప్రకారం ఖాతాదారులకు పంపిణీ చేసేటట్లు మీరు నిర్ధారించుకోవాలి.
2. 2018 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఎస్‌డిఎస్ ఖాతాదారులకు జనవరి 01, 2019 న ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా, మా సర్క్యులర్ CO.DT.No.15.01.001/H-3527/2003-04 తేదీ డిసెంబర్ 30, 2003 నాటి ఇప్పుడు వర్తించే సూచనలకు లోబడి, పంపిణీ చేయాలని సలహా ఇవ్వడమైనది.
3. దయచేసి మీ అన్ని డిపాజిట్ కార్యాలయాలకు తగిన సూచనలను ఇవ్వండి.
మీ విధేయులు,
(ఎ. సిద్ధార్థ్)
మేనేజర్ |