ఫిబ్రవరి 28, 2019
ఆర్.బి.ఐ/2018-19/133
డిసియం(పియల్జి...)నం.2128/10.25.007/2018-19.
ది చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ /చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్
కరెన్సీ చెస్ట్ లు కలిగియున్నఅన్ని బ్యాంకులు
మేడమ్/సర్,
నోట్లు మరియు నాణేల స్టోరేజి
అక్టోబర్ 04, 2016 తేదీ ద్రవ్య విధాన ప్రకటన పేరా 15 లో ప్రకటించినట్లు, రవాణా లో ఉన్న ఖజానా రక్షణకు ఉన్న యావత్తు సరళిని పునస్సమీక్ష చేయడం కోసం, రిజర్వు బ్యాంకు కరెన్సీ రవాణా పై కమిటిని (సిసియం) (అధ్యక్షుడు: శ్రీ డి.కె. మొహంతి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిశీలించడం జరిగింది; మరియు కరెన్సీ చెస్ట్ (సిసి లు)లలో ఉన్న స్టోరేజి సదుపాయాలను ప్రమాణీకరించేందుకు సంబంధించి ఈ క్రింది సిఫార్సులను వెంటనే అమలుచేయాలి:
-
వాల్ట్ ప్రదేశం పెద్దదిగా గల సిసి లు నాణేలను, వాల్ట్ లోపల విడిగా స్పష్టమైన వీక్షణకు మరియు నిఘా నేత్రాల కవరేజ్ కు ఆటంకం లేకుండా, వొక జాలీ నిర్మాణక్రమం/ అడ్డుగోడల(బారికేడ్ లు)తో తప్పనిసరి వేరుచేయబడేట్లుగా నిల్వ చేయాలి.
-
వాల్ట్ లోపల తగినంత స్టోరేజ్ స్పేస్ లేని సిసి లు ఈ సర్కులర్ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని; నోట్లు మరియు నాణేల తావులను స్పష్టంగా గుర్తుపట్టేవిధంగా, వారి కార్యాచరణ సులభతరం కోసం తగినవిధంగా నాణేలను విడిగా నిఘా నేత్రాల కవరేజ్ క్రింద నిల్వ చేయడం కొనసాగించవచ్చు.
-
బ్యాంకులు వారి అన్ని కరెన్సీ చెస్ట్ లకు, డినామినేషన్ వివరాల గుర్తింపు కోసం వారి బిన్స్ ను స్పష్టంగా కలర్ కోడ్ చేయడానికి మరియు నోట్లను కొత్తవి, తిరిగి జారీచేయబడేవి మరియు మాసినవి గా స్పష్టంగా ప్రత్యేకనం చేయడానికై, ఏకరీతిలో వర్తించేలా తగిన ప్రక్రియ లను రూపొందించాలి. యన్.యస్.యం లపై ఇంకా ప్రాసెస్ చేయాల్సిన నోట్లు కలిగిన బిన్స్ లు విడిగా రంగుతో కోడ్ చేయబడాలి.
2. మీ బ్యాంక్ యొక్క అన్ని కరెన్సీ చెస్ట్ లలో ఈ విధానం ఆచరణకు సంబంధించిన నిర్ధారణను, మీ ప్రధాన కార్యాలయం ఎవరి అధికార పరిధిలో ఉన్నదో ఆ ప్రాంతీయ కార్యాలయo ఇష్యూ డిపార్టుమెంటుకు సెప్టెంబర్ 30, 2019 వ తారీకు లోపున పంపాలి.
మీ విధేయులు
(అవిరల్ జైన్)
జనరల్ మేనేజర్ |